
సాక్షి, అమరావతి : గుజరాత్‌లో చిక్కుకున్న 4 వేల మంది మత్స్యకారులను త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 65 బస్సుల్లో వారందరినీ రాష్ట్రానికి తీసుకొస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరినీ ప్రభుత్వమే సొంత గ్రామాలను తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు.
మత్స్యకారుల గురించి సీఎం జగన్ జగన్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎంలతో మాట్లాడారని, వారి అనుమతితో అందరికి రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సొంత గ్రామాలను చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీఎం జగన్ ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే గుజరాత్‌కు 54 బస్సులు బయల్దేరాయని, మరో కొద్ది గంటల్లో మిగిలిన బస్సులు కూడా వెళ్తాయని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న అందరినీ క్వారంటైన్‌కు తరలించి గడువు ముగిసిన తర్వాతనే ఇళ్లకు పంపిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment