
సాక్షి, గుంటూరు: కోవిడ్-19 నివారణ చర్యలు చేపట్టడంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కరోనా ప్రభావంతో అన్ని రకాల వ్యవస్థలు స్థంభించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతు సంక్షేమంపై దృష్టి సారించారని తెలిపారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ యోజన' కింద రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మందికి ప్రభుత్వం నగదు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ప్రారంభం నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పంట వేసిన నాటి నుంచి దాన్ని అమ్మేవరకు సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన మాటపై ప్రభుత్వం నిలబడిందని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లను కేటాయించిన ఘనత సీఎం జగన్‌ది అని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను కేంద్ర బృందం సైతం అభినందించిందన్నారు. (‘రైతు భరోసా’ నగదు జమ)
టీడీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
"నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మడం సహజమే. ఇదేమీ కొత్తకాదు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సమంజసం కాదు. గత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూములను అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. సదావర్తి భూముల విషయంలో టిడిపి దిగజారుడుతో వ్యవహరించింది. చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుని సింగపూర్ సంస్థలకు అప్పగించారు. అభివృద్ది పేరుతో భూములను అమ్మడం అనే అంశం పై టీడీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భూముల విషయంలో గత ప్రభుత్వ అవినీతి తవ్విన కొద్ది బయటపడుతుంది" అని మోపిదేవి వెంకటరమణ అన్నారు. (‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment