
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వీరిద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 22న పిల్లి సుభాష్‌చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.(కరోనా నివారణకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు)