జమ్మూ కశ్మీర్‌.. 81 బ్లాకుల్లో బీజేపీ విజయం | BJP Won 81 Blocks In Jammu Kashmir BDC Elections | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌.. 81 బ్లాకుల్లో బీజేపీ విజయం

Published Fri, Oct 25 2019 8:46 AM | Last Updated on Fri, Oct 25 2019 8:54 AM

BJP Won 81 Blocks In Jammu Kashmir BDC Elections - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఫలితాలపై అందరికి ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 217కు పైగా స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 81 బ్లాక్‌లను కైవసం చేసుకుంది. జమ్మూ రీజియన్‌లో మూడోవంతు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. కశ్మీర్‌ రీజియన్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

కాగా, ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌లు దూరంగా ఉన్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత తమ పార్టీలకు పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని నిరసిస్తూ వారు ఆ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకోకముందే.. ఆ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ బ్లాక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థే గెలుపొందారు. అలాగే జేకేఎన్‌పీపీ పార్టీ 8 భ్లాకుల్లో విజయం సాధించింది.

జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 316 బ్లాక్‌లు ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల 6 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 310 బ్లాక్‌లకు ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల కాగా, అందులో 27 బ్లాక్‌లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 283 బ్లాకులకు పోలింగ్‌ జరగింది. అందులో 280 బ్లాక్‌ల ఫలితాలను వెలువడగా.. మరో 3 బ్లాక్‌ల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 98.3 శాతం పోలింగ్‌ నమోదైంది.

రీజియన్‌ల వారీగా ఫలితాలు

  • కశ్మీర్‌ రీజియన్‌లోని 128 బ్లాక్‌లు.. బీజేపీ-18, స్వతంత్రులు-109, కాంగ్రెస్‌-1 
  • లదాఖ్‌ రీజియన్‌లో 31 బ్లాక్‌లు.. బీజేపీ -11, స్వతంత్రులు-20
  • జమ్మూ రీజియన్‌లో 151 బ్లాక్‌లు.. బీజేపీ-52, జేకేఎన్‌పీపీ-8, స్వతంత్రులు-88, మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement