
తాడేపల్లి: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు అంశంపై పంచాయతీరాజ్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఈనెల 7వ తేదీ లోపు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 8వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment