Anil Kumar Yadav Confident Of YSRC Party Winning Upcoming Panchayat Elections - Sakshi
Sakshi News home page

‘ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం మాకే సొంతం’

Published Thu, Jan 28 2021 2:15 PM | Last Updated on Thu, Jan 28 2021 3:12 PM

Anil Kumar Yadav Get Confidence To Win In Upcoming Panchayat Elections - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, కర్నూలు : నామినేషన్లు వేసేందుకు దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్, చైర్మన్ ఎన్నిక విషయంలో గట్టి కృషి చేసి భారీ మెజారిటీతో గెలుపొందేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో సత్తా చాటబోతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, ఇతర తోక పార్టీలు ఎన్నికల్లో కనీసం 25 శాతం పంచాయతీలను కైవసం చేసుకునే దమ్ముందా అని మంత్రి సవాల్‌ విసిరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే రేపటి ఎన్నికల్లో సాధించే విజయానికి నిదర్శనమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. డకోటా ఛానళ్లను వెంటపెట్టుకొని నామినేషన్‌లకు, ఎన్నికల ప్రక్రియకు టీడీపీ వెళ్ళినా.. తమకేం అభ్యంతరం లేదని తెలిపారు. రికార్డ్ బ్రేక్ చేయడం, ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం ఒక్క వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement