సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బాబు మెజారిటీ సీట్లు గెలవలేకపోయారు. సతీష్‌రెడ్డి , డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్ టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజీనామా చేసిన సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి.
(చదవండి: చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం.. )
వైఎస్సార్‌సీపీ అక్రమంగా.. దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. వంత పలికే మీడియా, పత్రికలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు పార్టీని కాపాడుకోవాలని చూస్తున్నారు. వలంటీర్లను ప్రచారానికి వాడుకుంటున్నామని పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. వలంటీర్లు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇళ్ల పట్టాలు ఇతరత్రా 60 రకాల పనులు చేస్తున్నారు. ఉక్రోషంతోనే చంద్రబాబు నేను నిన్నటి దాడిలో పాల్గొన్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాపై పరుష పదజాలం వాడిన చంద్రబాబు తీరును అతని విజ్ఞతకే వదిలేస్తున్నాను. బాబు మాటలతో ఇలాంటి నాయకుడా సీఎంగా మనల్ని పాలించింది అని రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు’అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
(కాకినాడలో జనసేనకు ఝలక్)
(పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ)
Comments
Please login to add a commentAdd a comment