అబద్ధాలతో మోసగించే నైజం చంద్రబాబుది | Peddireddy Ramachandra Reddy fires on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో మోసగించే నైజం చంద్రబాబుది

Published Sat, Dec 28 2024 4:39 AM | Last Updated on Sat, Dec 28 2024 4:39 AM

Peddireddy Ramachandra Reddy fires on Chandrababu naidu

విద్యుత్‌ చార్జీలు పెంచనని పది సభల్లో బాబు హామీ ఇచ్చారు

అధికారంలోకి రాగానే విద్యుత్‌చార్జీలు పెంచాడు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం 

పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రతి చోటా పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే నైజం చంద్రబాబు­దేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెతారు. విద్యుత్‌ చార్జీలు పెంచబో­నని ఎన్నికల్లో అనేక సభలో హామీ ఇచ్చిన చంద్ర­బాబు.. అధికారంలోకి రాగానే ప్రజలపై రూ.15,485,36 కోట్లకు పైగా కరెంటు చార్జీల భారం వేశారని తెలిపారు. ప్రజలను వంచించిన చంద్రబాబుకు గుణపాఠం నేర్పా­లని పిలుపు­నిచ్చారు. 

విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ ఎంపీ పెద్దిరెడ్డి మిధు­న్‌­రెడ్డి,  మాజీ ఎంపీ రెడ్డెప్పతో కలసి వేలాదిమందితో శుక్రవారం పట్టణంలో జోరు వాన­­లోనూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లా­­డుతూ.. విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించాలని, రైతులందరికీ వ్యవసాయ కనె­క్షన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. 

గత చంద్రబాబు పాలనలో మూడు డిస్కంలు రూ.86 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిస్కంలకు ఆర్థిక సహా­యం చేకూర్చి, మళ్లీ లాభాల బాట పట్టించారని  తెలిపారు. అలాగే సోలార్‌ విద్యు­త్‌ను చవగ్గా రూ.2.49కే  అందించేందుకు సెకితో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement