మత్తు పదార్ధాలకు విద్యార్థులు బానిసలు కావడం పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: మత్తు పదార్ధాలకు విద్యార్థులు బానిసలు కావడం పట్ల వైఎస్సార్ సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియా అంశాన్ని ఆయన బుధవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జర్మనీ, యూకే దేశాల నుంచి మాదక ద్రవ్యాలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ముఠా వెలుగు చూసిన నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు.