death anniversary celebrations
-
కలాం వర్ధంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నేడు. ఈ సందర్భంగా.. కలాంను కొనియాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు.దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2024కలాం 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘‘శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కలాంకు నివాళులర్పించారు. Remembering Dr. APJ Abdul Kalam, Former President of India, great scientist, and inspiring personality, on his death anniversary. His vision, humility, and unwavering dedication to education and innovation continue to inspire us. Let's honour his legacy by striving for excellence… pic.twitter.com/6u4B1tZsvD— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024 -
నవ్వొద్దు.. ఏడ్వొద్దు.. తాగొద్దు.. ఉల్లంఘిస్తే ఖతమే!
North Korea Banned Laughing: ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవించే కొరియన్లపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యే అధ్యక్షుడిగా పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచాయి. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఇల్ చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. సినుయిజు సిటీలోని ఫ్రీ ఏషియా రేడియో నెట్వర్క్ అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు. ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా(కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా వాళ్లు మళ్లీ కనిపించకుండా పోతారు(అయితే మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు). ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదన్న ఆదేశాలు జారీ చేసిందట కిమ్ కార్యాలయం. కొత్తేం కాదుగా.. - ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్‌గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. - క్యాపిటలిస్టిక్ లైఫ్‌స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్‌ను బ్యాన్ చేశాడు. - తన స్టయిల్‌ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు. - స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు. చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్! -
15న పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం
సాక్షి, అమరావతి: ఈ నెల 15న రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వేడుకలను రాష్ట్రమంతటా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు 15 ఆదివారం సెలవురోజు కావడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా ఆదేశాలు జారీ చేసింది. -
‘రాజన్నా.. నిను మరువలేమన్నా’
జిల్లా ముద్దు బిడ్డ.. కడప ఖ్యాతిని దేశ వ్యాప్తంగా వెలిగేలా చేశారు. వైఎస్ పేరు కాదు బ్రాండ్.. అనే స్థాయికి ఎదిగారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. నిరుపేదల కష్టాలను అతి దగ్గర నుంచి చూసిన ఆయన.. వారి కుటుంబాల్లో చిరునవ్వులు పూయించారు. చెప్పింది చేయడమే కాదు.. చెప్పనిది చేసి చూపించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించారు. దేశం యావత్తు ఆశ్చర్యపోయేలా ఉమ్మడి రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) లో ప్రగతి పరుగులు పెట్టించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. సొంత జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశారు. కడప రూపురేఖలే మారిపోయాయి. పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. జన హృదయాల్లో నిలిచిపోయారు. ‘రాజన్నా.. నిను మరువలేమన్నా’... మా గుండెల్లోనే కొలువైనావన్నా.. అంటూ కీర్తిస్తున్నారు. ‘ప్రగతి పనుల్లో నీ రూపం కనిపిస్తోంది. సంక్షేమ పథకాల్లో నీ చిరునామా స్పురిస్తోంది’ అంటూ కొనియాడుతున్నారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాక్షి, వైవీయూ : కరువు సీమ నుంచి క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తే.. కడప గడప నుంచి సైతం పతకాలు వస్తాయన్న ఆలోచన.. వైఎస్ఆర్ రాష్ట్ర స్థాయి క్రీడాపాఠశాలకు పునాదిరాయి పడేలా చేసింది.. విశ్వవిద్యాలయ, ఉన్నత విద్యను జిల్లా ప్రజలకు అందించాలన్న సంకల్పం తత్వవేత్త యోగివేమన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీజం వేసింది. ఒకటా.. రెండా.. చెప్పుకుంటూ పోతే జిల్లా అంతటా వైఎస్ఆర్ తనదైన మార్కుతో అభివృద్ధికి బాటలు వేయగా.. నాడు నాటిన అభివృద్ధి బీజాలు నేడు ఫలాలను ఇస్తున్నాయి. ఉన్నత విద్యావంతుడైన వైఎస్ఆర్ హయాంలో కడపలో విద్యాలయాలు ఏర్పాటు కాగా.. వేల మంది విద్యార్థులు ఈ సంస్థల్లో విద్యాభ్యాసన చేస్తున్నారు. 2006 డిసెంబర్ 30న ప్రాంతీయ క్రీడా పాఠశాల ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి పాఠశాలగా ఉన్నతీకరణ చెందింది. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం కడప నగరంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైదానం ఏర్పాటయ్యేందుకు వైఎస్ఆర్ చూపిన చొరవ అనిర్వచనీయం. స్వయానా రూ.50 లక్షల సొంత నిధులను వెచ్చించారు. దీంతోపాటు ఎకరా రూ.వెయ్యి చొప్పున 11 ఎకరాలు కేటాయించడంతో కడపలో మైదానం ఏర్పాటు చేసేందుకు ఏసీఏ ముందుకు రావడంతోపాటు వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరు మీదుగా వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం ఏర్పాటైంది. కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ సిలబస్ కోరుకునే విద్యార్థుల కోసం వైఎస్ఆర్ కృషితో కడప నగరంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను కడప నగరానికి తీసుకువచ్చారు. మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధి కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల అభివృద్ధికి కోటిరెడ్డి, రామసుబ్బమ్మ తర్వాత అంత స్థాయిలో వైఎస్ఆర్ కృషి చేశారు. వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం కడపలోని డీఎస్ఏ ఆవరణలో రూ.5.1 కోట్లతో వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. 2009 జనవరి 24న వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మైదానం నేడు ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులకు నెలవుగా మారింది. ‘వేమన’తో విశ్వ ఖ్యాతి కరువుసీమలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న తలంపుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం విశ్వఖ్యాతని చాటిచెబుతోంది. 2006 మార్చి 9న పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 28 కోర్సులతో విలసిల్లుతోంది. 1500 మందికి పైగా విద్యార్థులు 113 మంది అధ్యాపక బృందం, 100 మంది పైగా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్ 20న తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగరానికి సమీపంలో పీజీ సెంటర్ ఏర్పాటు చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారింది. అనంతరం 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. కొత్త కలెక్టరేట్‌తో సహా మరెన్నో.. రాజధాని ప్రాంతంలోని సచివాలయానఇన తలపించేలా .. కడపలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్.. నగరానికే తలమానికంగా నిలుస్తోంది. కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి వైఎస్ఆర్ పూనుకోగా.. నేడు అందుబాటులోకి రావడంతో సరికొత్త అందం చేకూరింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరం, వైఎస్ఆర్ ఆడిటోరియం, ఉప రవాణా కార్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్, శిల్పారామం ఏర్పాటు చేశారు. పశువైద్య కళాశాల ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు యోగివేమన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ స్థాపించారు. దీంతో ఇంజనీరింగ్ కళాశాలకు కూడా వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీగా నామకరణం చేశారు. ప్రొద్దుటూరులోని ఏరియా ఆస్పత్రిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కడపలోని జిల్లా ఆస్పత్రి స్థానంలో రిమ్స్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ జిల్లా ఆస్పత్రిని నిర్మించారు. రిమ్స్.. సూపర్ కడప అర్బన్ : కడప నగర శివారులో ‘రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (రిమ్స్)కు 2005లో 230 ఎకరాల విస్తీర్ణంలో శంకుస్థాపన చేశారు. జిల్లా ప్రజలకు వైద్య ప్రదాయినిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ. 150 కోట్ల నిధులు కేటాయించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. 2007 సెప్టెంబర్ 5న అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ‘రిమ్స్’ భవనాలను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు శంకుస్థాపన చేయించారు. అదే క్రమంలోనే నర్సింగ్ కళాశాలను ప్రారంభింప చేశారు. ప్రభుత్వ దంతవైద్య కళాశాలను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మింప చేసి 2009 జనవరి 24న భవనాలను ప్రారంభించారు. ప్రస్తుతం రిమ్స్ ప్రజలకు సూపర్‌గా సేవలందిస్తోంది. కడపకు సొబగులు కడప కార్పొరేషన్ : వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప గడపను వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధికి చిరునామాగా మార్చారు. మున్సిపాలిటీగా ఉన్న కడప పట్టణాన్ని నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేశారు. ఇరుకుగా ఉన్న అన్ని రోడ్లను విస్తరింపజేసి, డివైడర్లు, పచ్చని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని సుందరంగా మార్చారు. బుగ్గవంక సుందరీకరణ పేరుతో బుగ్గవంక చుట్టూ ప్రహరీ నిర్మించి హైలెవెల్ వంతెనలు, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించారు. కడప చుట్టూ రింగు రోడ్డు నిర్మించారు. కడప విమాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమించారు. ఆర్టీపీపీకి వెలుగులు ఎర్రగుంట్ల: మండలంలోని ఆర్టీపీపీకి వెలుగుకు నింపిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుంది. సుమారు రూ.140 కోట్లతో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి ఆర్టీపీపీకి 68 కిలో మీటర్ల పొడవున పైపులైన్ వేశారు. ఇప్పుడు ఆర్టీపీపీ కాంతులను వెదజల్లుతుంది. యూనిట్ల సామర్థ్యం కూడా పెంచారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నీరు వస్తుండటంతోనే 600 మెగావాట్ల 6వ యూనిట్ ప్రస్తుతం దిగ్విజయంగా నడుస్తోంది. పశుపరిశోధన కేంద్రం పులివెందుల: పులివెందుల నియోజకవర్గంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల నెలకొల్పారు. పాడి పరిశ్రమాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారు. పీఎంఈవై, పశుక్రాంతి కింద విరివిగా పాడి పశువులను రాయితీతో ఇవ్వడంతో జిల్లాలోనే పులివెందులలో అత్యధికంగా పాల సేకరణ జరిగింది. అదే విధంగా పాడి పశువులకు వచ్చే జబ్బుల నివారణకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పారు. ఈ ఆసుపత్రిలో పాడి పశువులలో వచ్చే ప్రాణాంతక జబ్బులను నివారించేందుకు అందుబాటులోకి అధునాతన వైద్య చికిత్సలు తెచ్చారు. అదే విధంగా 654 ఎకరాలలో రూ.350 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయి పశుపరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరువు నేలలో ఉద్యాన కళాశాల రైల్వేకోడూరు : మండలంలోని అనంతరాజుపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 15 కోట్ల రూపాయలతో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేశారు. 2007 జూన్ 26న ప్రారంభమైంది. రాయలసీమ ప్రాంతంలో ఏకైక ఉద్యాన కళాశాలగా పేరుగాంచింది. రైతన్నలకు సేవ చేయడానికి సరికొత్త వంగడాలు, వ్యవసాయంలో నూతన వరవడులు తొక్కించడానికి ఎందరో యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి వస్తున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతూ కేవలం వ్యవసాయం పైనే ఆధారపడే ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేయడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలచి పరిశోధనా స్థానానికి అనుసంధానంగా ఆ ప్రాంగణంలోనే ఉద్యాన కళాశాల ఏర్పాటు చేసి, అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ ఎస్సీ హార్టికల్చర్ ప్రధాన కోర్సు, దానితోపాటు ఎమ్మెస్సీ, ఫ్రూట్‌సైన్స్, వెజిటేబుల్ సైన్స్, ఫ్టోరీ కల్చర్, స్పైసెస్, మెడీషియన్ ప్లాంటేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఇక్కడ నాలుగేళ్ల కోర్సును పూర్తి చేసుకున్న ఎందరో విద్యార్థులు ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రాష్ట్ర సర్వీసులు, పలు ప్రైవేటు విత్తన, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి బ్యాంకుల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ వేంపల్లె : విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి.. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విద్య దక్కడం లేదన్న అభిప్రాయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఇడుపులపాయలో 2008లో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఇక్కడ జిల్లాతోపాటు రాయలసీమలోని విద్యార్థులు చదువుకుంటున్నారు. అపర భగీరథుడు చాపాడు: వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టి అపర భగీరథుడిగా నిలిచారు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు శాశ్వత సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. తెలుగుగంగలో అంతర్భాగమైన ఎస్సార్–1, ఎస్సార్–2, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులతో మైదుకూరుతోపాటు బద్వేలు నియోజకవర్గ ప్రాంతాలకు సాగునీటి లబ్ధి కలిగింది. వెలిగల్లు ప్రాజెక్టు రాయచోటి: కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. కడప–అనంతపురం జిల్లాలో సరిహద్దులో నత్తనడకన నిర్మితమవుతున్న వెలిగల్లు ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయించారు. రాష్ట్రంలోనే తొలి జలయజ్ఞం ప్రాజెక్టుగా పూర్తి చేసి 2009లో వైఎస్ఆర్ తన చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. చిత్తూరు–కడప జిల్లాల సరిహద్దులో ఝరికోన ప్రాజెక్టును నిర్మించి దశాబ్దాల రైతుల ఆశలను నెరవేర్చారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా చిన్నమండెం మండలంలోని దేవగుడిపల్లె సమీపంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సర్వరాయసాగర్ వల్లూరు : గాలేరు –నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్ ప్రాజెక్ట్‌ను కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలో నిర్మించడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించారు. ఈ ప్రాజెక్ట్ పనులు వైఎస్ సీఎంగా ఉండగా పరుగులు తీశాయి. 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. మహానేత మరణంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. తరువాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. పులివెందుల : గండికోట, పైడిపాలెం ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. పైడిపాలెం ప్రాజెక్ట్‌కు రూ.690 కోట్లు ఖర్చు చేయగా.. అనంతరం వచ్చిన పాలకులు కేవలం రూ.30 కోట్లు ఖర్చు చేసి ప్రారంభించారు. కృష్ణా జలాలు పులివెందుల ప్రాంతానికి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ(కాలువలకు లైనింగ్) ఏర్పాటు, సూక్ష్మ నీటి కేంద్రం కింద సింహాద్రిపురం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం జరిగింది. పైడిపాలెం నుంచి చిత్రావతి, హిమకుంట్ల, తొండూరు చెరువులకు నీరు అందించడానికి పనులు ప్రారంభించారు. హిమకుంట్ల చెరువును పీబీసీ కాలువలోకి లిఫ్ట్ ద్వారా ఆయకట్టుకు నీరు అందించేలా పనులు చేపట్టారు. -
మనసున్న మారాజు
సాక్షి, పులివెందుల : దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మనసున్న మహారాజు అని వైఎస్ కుటుంబ సభ్యులు, వక్తలు, పలువురు కొనియాడారు. వైఎస్ వివేకానందరెడ్డి జయంతి వేడుకలను పులివెందులలో గురువారం ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ సమాధుల తోటలో వైఎస్ వివేకానందరెడ్డి ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, వివేకా సోదరి విమలమ్మ, సోదరులు సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభను పాస్టర్ బెనహర్ బాబు, పాస్టర్ మైఖేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కుటుంబానికి, ప్రజలకు వైఎస్ వివేకానందరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. వివేకానందరెడ్డి భౌతికంగా దూరమైనా... కుటుంబ సభ్యుల అందరి మనసులో, పులివెందుల ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు.డాక్టర్ ఇసీ గంగిరెడ్డి, ఇసీ సుగుణమ్మ, దివంగత జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ కొండారెడ్డి, క్రిష్టఫర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు స్థానిక సీఎస్ఐ చర్చిలో ఉదయ కాలపు ఆరాధన నిర్వహించారు. అనంతరం సీఎస్ఐ చర్చి సంఘ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మతోపాటు పాస్టర్ బెనహర్‌బాబు, సెక్రటరీ శిఖామణితోపాటు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం పట్టణంలోని పలు కాలనీల్లో అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మధురెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, నగరిగుట్ట ఎస్సీ కాలనీల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిన్నప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కోడి రమణ, కోళ్ల భాస్కర్, బూత్ కమిటీల మేనేజర్ గంగాధరరెడ్డి, కార్యకర్తలు శ్రీను, ప్రభుదాసు, ఏసు, నాగేంద్ర, కుళ్లాయప్ప, బాబు, జకరయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన వైఎస్ కుటుంబీకులు ఇంటి సమీపంలో పాల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ వివేకా విగ్రహం సమీపంలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, దివంగత జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. -
సౌత్ ఆఫ్రికాలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
-
ఏపీజే అబ్దుల్ కలాంకు ఘననివాళి
వనపర్తిటౌన్: అధికారం సమాజశ్రేయస్సుకు వెచ్చించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఏపీజే అబ్దుల్ కలాం ప్రాణం పోశారని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతిని శుక్రవారం టీజేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ రెండోసారి రాష్ట్రపతి అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలిపారు. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత మరుసటి రోజు అధికారిక లాంఛనాలను దరిచేరనీయలేదన్నారు. కలలు కని, వాటిని సహకారం చేసుకోవాలని భారతవనికి దిశనిర్దేశం చేసిన మహానీయుడు కలాం అని వెల్లడించారు. టీజేఎస్ పట్టణాధ్యక్షుడు ఖాదర్‌పాష, పానుగంటి నాగన్న, గిరిజన నేత హరీష్, కృష్ణ పాల్గొ న్నారు. ఖిల్లాఘనపురం: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల్లో శుక్రవారం దివంగత మాజీ రాష్ట్రపతి భారత రత్న అవార్డు గ్రహిత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వకృ త్వ పోటీల విజేతలకు విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు గోపి బహుమతులను అందజేశారు. గురుపౌర్ణమిని పురష్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. -
అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
పుల్లంపేట: సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలని పీవీజీ పల్లి ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి పేర్కొన్నారు. పాఠశాలలో శుక్రవారం సాయంత్రం అబ్దుల్ కలాం వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి చదువుకున్న అబ్దుల్‌కలాం గురువుగా, శాస్త్రవేత్తగా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నేటి విద్యార్థులందరూ అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సుబ్బరామిరెడ్డి, చంద్రకుమార్, శివశంకర్ రాజు, నవీన్‌కుమార్, భారతీ అబ్దుల్‌కలాం జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో రెడ్డిప్రసాద్, గంగనపల్లె వెంకటరమణ మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు గుత్తికొండ హేమసుందరం రచించిన ‘ఓ విద్యార్థి తెలుసుకో’ అనే పుస్తకాలను హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేశారు. -
జగ్జీవన్ రాం ఆశయసాధనకు కృషి
రెబ్బెన: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలు అందించిన బాబు జగ్జీవన్‌రాం ఆశయాలను కొనసాగించేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షుడు బోడ భద్రు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోషియేషన్ ఏరియా ఉపాధ్యక్షుడు గోపాలక్రిష్ణ సూచించారు. శుక్రవారం గోలేటి టౌన్షిప్ లోని తెలంగాణ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రాం 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి హరిజన, గిరిజన, బహుజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని హరిజన, గిరిజనులతో పాటు బడుగు, బలహీన వర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి అభివృద్ధి మార్గంలో ముందుండి నడవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిబాటలో నిలవాలన్నారు. బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకున్న వారిలో బాబు జగ్జీవన్‌రాం ముఖ్యుడన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశ స్వాతంత్య్రం కోసం పాటు పడ్డారన్నారు. ప్రజానాయకుడిగా పేరు పొందటంతో పాటు సుధీర్ఘకాలం పాటు పార్లమెంటు సభ్యులుగా పని చేసి ఎన్నో పదవులు అదిష్టించారన్నారు. పీడిత, తాడిత ప్రజల ఆశాజ్యోతిగా పేరుపొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి మహోన్నతుడి ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి జాదవ్ సంజేష్, నాయకులు అంజనేయులుగౌడ్, లింగంపల్లి ప్రభాకర్, మల్రాజు రాంబాబు, కోరాల రాజేందర్, పోషం, శంకర్ పాల్గొన్నారు. -
చిల్డ్రన్ హోమ్‌లో అంబానీ ఫ్యామిలీ..
ముంబై : నగరంలోని ఓ చిల్డ్రన్ హోమ్‌లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సందడి చేసింది. శుక్రవారం ధీరూభాయ్ అంబానీ 16వ వర్థంతి సందర్భంగా వారు చిల్డ్రన్ హోమ్‌ను సందర్శించారు. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కూతురు ఇషా అంబానీ, కాబోయే కోడలు శ్లోకా మెహతా అక్కడి పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ముంబైలోని వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు కనీస అవసరాలను రిలయన్స్ ఫౌండేషన్ తీరుస్తోంది. దాదాపు 3500 మంది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా లబ్ధిపొందుతున్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను, ఇతర వసతులను సమకూర్చటంలో ఫౌండేషన్ ముందుంటోంది . -
ఓయూలో ఘనంగా పూలే వర్థంతి
హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే 124వ వర్థంతి శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఓయూ ఆర్ట్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.