అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం
పుల్లంపేట: సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలని పీవీజీ పల్లి ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి పేర్కొన్నారు. పాఠశాలలో శుక్రవారం సాయంత్రం అబ్దుల్ కలాం వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి చదువుకున్న అబ్దుల్‌కలాం గురువుగా, శాస్త్రవేత్తగా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు.
నేటి విద్యార్థులందరూ అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సుబ్బరామిరెడ్డి, చంద్రకుమార్, శివశంకర్ రాజు, నవీన్‌కుమార్, భారతీ అబ్దుల్‌కలాం జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో రెడ్డిప్రసాద్, గంగనపల్లె వెంకటరమణ మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు గుత్తికొండ హేమసుందరం రచించిన ‘ఓ విద్యార్థి తెలుసుకో’ అనే పుస్తకాలను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment