వైరల్‌: వామ్మో.. అంత మంది అమ్మాయిలా? | Only boy among 500 girls exam center Bihar Nalanda faints Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: వామ్మో.. అంతమంది అమ్మాయిలా?.. రియల్‌ ఆణిముత్యం!

Published Thu, Feb 2 2023 7:14 AM | Last Updated on Thu, Feb 2 2023 7:17 AM

Only boy among 500 girls exam center Bihar Nalanda faints Viral - Sakshi

Viral News: పాపం.. పరీక్ష హాల్‌లో అంత మంది అమ్మాయిలను ఒక్కసారిగా చూసేసరికి ఆ కుర్రాడికి ఏం అనిపించిందో ఏమో!. వాళ్ల మధ్యలో తానొక్కడే ఉన్నాడన్న సంగతి తెలిసిన ఆ కుర్రాడు.. ఏకంగా స్పృహ కోల్పోయాడు. బిహార్​లోని​ నలందాలో బుధవారం ఈ ఘటన జరిగింది. 

బీహార్‌లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మనీశ్ శంకర్​ ప్రసాద్‌ (17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజ్​ స్టూడెంట్‌. తొలి పరీక్ష మ్యాథ్​మెటిక్స్ రాసేందుకు మనీశ్​ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్​, సుందరగడ్​లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్​కు తీసుకొచ్చాడు. అయితే.. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్​లోకి వెళ్లాడు. అక్కడ అంతా బాలికలు ఉండేసరికి.. ఆశ్చర్యపోయాడు. అతని చూసి అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘోల్లుమనడంతో.. అర్థంకాని అయోమయంలో ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు మనీశ్​. దీంతో అతన్ని సర్దార్‌ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు పరీక్షా నిర్వాహకులు. 

‘‘ఒకేసారిగా అంతమంది అమ్మాయిలను చూసి చాలా కంగారుపడ్డాడు. అందుకే స్పృహతప్పిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడని ఆస్పత్రిలో అతని బాగోగులు చూసుకుంటున్న మనీశ్ శంకర్ మేనత్త చెబుతోంది. పూర్తిగా అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో పొరపాటున మనీష్‌కు కేటాయింపు జరిగిందని అక్కడి విద్యాధికారులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement