
నలంద : సాటి మనిషిని గౌరవించకపోగా వారిని చులకనగా చూడటం నేటికీ చూస‍్తూనే ఉంటాం. అయితే సాధారణ వ్యక్తులు ఇలా చేస్తేనే మనం తీవ్రంగా వ్యతిరేకించి వారికి హితబోధ చేస్తాం. కానీ బిహార్‌లో ఓ ప్రజాప్రతినిధే సాటి గ్రామస్తుడి పట్ల హీనంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలయ్యారు. నలంద జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు యాభైఏళ్లు పైబడిన వ్యక్తి ఏదో పనిమీద గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లాడు.
ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఆ వ్యక్తి సర్పంచ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక అది మొదలు సర్పంచ్ సహా కుటుంబసభ్యులు అతడిమీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆ వ్యక్తిని దారుణమైన శిక్ష వేశారు. తలుపు తట్టకుండా లోనికి వస్తావా ఎంతధైర్యం అంటూ బయటకు వెళ్లగొట్టారు. అంతటితో ఆటకుండా కొందరు మహిళలతో చెప్పులతో కొట్టించి దాడిచేశారు. చివరగా ఇంటిముందు ఉన్న మట్టిని, చెప్పులను నాలుకతో నాకాలని హింసించి పంతంతో ఆ వ్యక్తి ఆ పని చేయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ విషయంపై సర్పంచ్ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment