
పట్నా : ఆడపిల్లలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో నడిరోడ్డుపై కొంతమంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న యువతిని చుట్టుముట్టి అసభ్య సంభాషణలతో ఆమెను అడ్డుకున్నారు. నాలుగు వైపుల నుంచి ఆమెను చుట్టుమట్టి కదలనియకుండా చేశారు. కొంతసేపటికి ఒక వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకుని కిందపడేశాడు. కాగా కథువా, ఉన్నావ్ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను చేస్తున్నప్పటికి మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు తగ్గడం లేదు. ఆ వీడియోలో ఉన్న వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.