misbehavior
-
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
-
మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?.. విద్యార్థిపై నటి ఆగ్రహం
‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే హద్దురా) చిత్రంతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యలయాళ భామ అపర్ణా బాలమురళీ. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణా కథానాయికగా నటించింది. ఇందులో ఆమె తన అద్భుతన నటనకు గానూ ఆమెను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెతో ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తాజాగా మలయాళ భామ అపర్ణ విద్యార్థి తీరుపై స్పందించింది. ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని తెలిపింది. ఈ విషయంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అపర్ణ మాట్లాడుతూ.. 'తనను బలవంతంగా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైంది కాదు. అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఈ సంఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం నాకు లేదు. అంత టైం కుడా లేదు. అయితే ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని ఆమె వివరించారు. తన కొత్త మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కేరళలోని లా కాలేజీలో తన్కమ్ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ దర్శకుడు, హీరో వినీత్ శ్రీనివాసన్‌తో పాటు అపర్ణ కూడా పాల్గొంది. క్షమాపణలు కోరిన విద్యార్థి సంఘం అయితే ఈ సంఘటనపై ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి సంఘం విచారం వ్యక్తం చేసింది. దీనిపై క్యాంపస్ యూనియన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో విద్యార్థి సంఘం ఓ నోట్ విడుదల చేసింది. లా కాలేజీలో నటిపై ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం అంటూ యూనియన్ తరపున విచారం వ్యక్తం చేశారు. అయితే యూనియన్ ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుందని.. సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. View this post on Instagram A post shared by COLLEGE UNION 2022-23 (@glceunion22_23) -
Crime News: ఈ సుత్తితోనే నా మొగుడ్ని చంపేయ్!
తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మానవమృగంతో తాళి కట్టించుకుంది ఆమె. తప్పుడు దోవలో వెళ్తుంటే వద్దని బతిమాలుకుంది. వినలేదు సరికదా.. మరింత ఘోరంగా ప్రవర్తించబోయాడు. లాభం లేదనుకుని వదిలేయబోయింది. కానీ, తాను వదిలేసినా.. మొగుడి బుద్ధి మారదని అనుకుంది. చివరకు.. సుపారీ ఇచ్చి ఆ భర్తని ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఢిల్లీలో కలకలం సృష్టించిన వికాస్ నగర్ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి రెండో భార్య చంద్ర కళ(28).. సుపారీ రౌడీతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు వారం తర్వాత నిర్ధారించారు. అంతేకాదు పక్కా ప్లాన్‌తో మొగుడ్ని హత్య చేయించి.. దోపిడీహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిపారు. ఈ సుత్తితోనే చంపేయ్ మృతుడు వీర్ బహదూర్ వర్మ(50) వికాస్ నగర్లో ఓ బట్టల దుకాణం నడుపుతున్నాడు. కొన్నినెలల కిందట ఆ షాపులోనే పని చేసే చంద్రకళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబంతో రాజీ చేసుకున్న వర్మ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వర్మను గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్తగా అంగీకరించింది ఆమె. చెల్లిపై కన్నేశాడు.. అయితే పెళ్లి అయ్యాక తనతో సవ్యంగా ఉంటాడని భావించిన ఆమెకు.. నిరాశే ఎదురైంది. పైగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. వర్మ ప్రవర్తనతో విసిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు సైతం జరిగాయి. కొన్నివారాల కిందట.. కళ సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపైనా కన్నేశాడు వర్మ. ఇది పసిగట్టిన కళ.. భరించలేకపోయింది. కిరాయి హంతకుడి సాయంతో మొగుడ్ని చంపేందుకు ప్లాన్ వేసింది. సుపారీతో పాటు సుత్తి కూడా! రణ్‌హోలాకు చెందిన రౌడీ షీటర్ జుమ్మాన్‌ను కలిసి తన వ్యధను చెప్పింది చంద్రకళ. హత్య కోసం లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా అందించింది. ఆ సుత్తితోనే మొగుడ్ని చంపేయాలని కోరింది ఆమె. ఈ క్రమంలో.. మే 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో.. సుత్తితో వర్మపై దాడి చేశాడు జుమ్మాన్. అనంతరం శవాన్ని రోడ్డు మీద పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వర్మను.. డీడీయూ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చంపి.. దొంగతనంగా. భర్త హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చంద్రకళ. ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్‌కు ఇచ్చి పంపించి వేసింది. మొగుడి ప్రాణం పోయినా.. తాను జైలు పాలయినా.. తన చెల్లితోపాటు ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయని కన్నీళ్లతో చెబుతోంది చంద్రకళ. -
ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్
అనంతపురం క్రైం: అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అన్వర్ బాషా రెచ్చిపోయాడు. అకారణంగా ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న సుదర్శన్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నారాయణ కళాశాలలో చదువుతున్న తన కుమారుణ్ని తీసుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సైఫుల్లా బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బేకరీ వద్ద బండి ఆపి మిక్చర్ తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడ త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు బృందం వాహనాల తనిఖీ చేస్తోంది. ఓ యువకుడి బైక్‌పై నాలుగు ఫైన్లు (చలానాలు) పెండింగ్ ఉండడంతో వాటిని చెల్లించాలని ఎస్ఐ సూచించాడు. అదే సమయంలో సుదర్శన్‌రెడ్డి ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడు. దీన్ని గమనించిన కానిస్టేబుల్ అన్వర్‌బాషా చెలరేగిపోయాడు. ‘ఏరా.. వీడియో తీస్తున్నావా’ అంటూ విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను పలానా సంస్థలో ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపలపై ఇష్టానుసారంగా కొట్టాడు. కానిస్టేబుల్ అన్వర్‌బాషా తీరును అక్కడున్న వారు సైతం తప్పుబట్టారు. కొందరు పోలీసుల తీరు వివాదాస్పదం నగరంలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలను, మరీ ముఖ్యంగా వాహనదారులను అకారణంగా దూషించడం, కొట్టడం పరిపాటిగా మారింది. విద్యావంతులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తన హుందాగా ఉండాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా..వీరిలో మాత్రం మార్పు కన్పించడం లేదు. (చదవండి: చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..) -
ట్యూషన్ టీచర్ నాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు: నటి
Actress Devoleena Bhattacharjee Revealed About Shocking Incident In Her Childhood: ప్రముఖ హిందీ సీరియల్ నటి దేవొలీనా భట్టాచార్య.. చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఇటీవలె ఓ షోలో పాల్గొన్న ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ..'చిన్నప్పుడు ట్యూషన్‌కు వెళ్తే మ్యాథ్స్ టీచర్ తనతో చాలా తప్పుగా ప్రవర్తించాడని పేర్కొంది. అతనికి చాలా మంచి టీచర్ అని గుర్తింపు ఉండేది. నా ఫ్రెండ్స్ సహా చాలా మంది పిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్‌కు వెళ్లేవారు. అయితే వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్స్‌లో ఇద్దరు ట్యూషన్‌కు వెళ్లడం మానేశారు. ఏం జరిగింది అని అడిగినా చెప్పలేదు. ఆ తర్వాత ఓరోజు ఎప్పటిలాగానే నేను ట్యాషన్‌కు వెళ్లాను. అయితే అతను నాపై లైంగిక చర్యకు ప్రయత్నించాడు. వెంటనే ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అమ్మకి వివరించాను. ఆ తర్వాత ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిందంతా చెప్పాం. ఆ సమయంలో ఆ టీచర్‌పై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనిపించింది. కానీ ఇంట్లో వాళ్లు అలా చేయలేదు. దయచేసి మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి. అంతే తప్పా చూసీ చూడకుండా వదిలేయకండి' అంటూ తల్లిదండ్రులకు విఙ్ఞప్తి చేసింది. -
అమానుషం: ఆటో డ్రైవర్‌పై మూత్ర విసర్జన
సాక్షి, యలహంక(కర్ణాటక): ఆటో డ్రైవర్‌ను బాత్రూములోకి లాక్కెళ్లి మూత్ర విసర్జన చేసిన అమానుష ఘటన భాగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుడు రాకేశ్‌కు ఆటో డైవర్ మురళికి పరిచయం ఉంది. ఇటీవల ఓ క్లబ్లో వైద్యుడు, అతని స్నేహితులు మద్యం సేవించారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ రావడంతో అతడిని కులం పేరుతో దూషించి మూత్ర విసర్జన చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుడిని అరెస్ట్ చేశారు. టైర్ పేలి వాహనం పల్టీ శివమొగ్గ : కారు టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన శివమొగ్గ జిలా భద్రావతి పట్టణ సమీపంలోని వీరాపుర క్రాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడిని సుశాంత్ (35)గా గుర్తించారు. ఇతను కుటుంబ సభ్యులతో ఎర్టిగా కారులో వెళ్తుండగా టైర్ పేలడంతో వాహనం బోల్తా పడింది. సుశాంత్ మృతి చెందాడు. గాయపడిన వారిని భద్రావతి ఆస్పత్రికి తరలించారు. -
మణికొండ: యువతితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, మణికొండ: తన క్యాబ్‌లో వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ సన్‌సిటీలో మంగళవారం రాత్రి జరిగింది. సన్‌సిటీలో నివసిస్తున్న ఓ యువతి హైదరాబాద్ నుంచి క్యాబ్‌లో హైదర్షాకోట్కు వచ్చింది. ఆ తరుణంతో డ్రైవర్ ఆ యువతితో అసభ్యంగా మాట్లాడటం, చేయిపట్టుకుని లాగటంతో ఆమె క్యాబ్ దిగగానే స్థానికులకు ఆ విషయం తెలిపింది. దీంతో అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేశామని సెక్టార్ ఎస్ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ) -
ఆన్లైన్ పాఠాలు..సెల్ఫోన్లో వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడు..
సాక్షి, టీ.నగర్(తమిళనాడు): విద్యార్థినులకు సెల్ఫోన్లో లైంగిక వేధింపులు చేసిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సోచట్టం కింద అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా, ముదుగళత్తూరులోగల పల్లివాసల్ ఉన్నత పాఠశాల లో సైన్స్ టీచర్‌గా హబీబ్ మహ్మద్ (36) పనిచేస్తున్నాడు. ఇతను 9, 10 తరగతి విద్యార్థినులకు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తూ వచ్చాడు. దీంతో వారి సెల్‌ఫోన్ నెంబర్లకు విడిగా ఫోన్ చేసి లైంగిక వేధింపులు చేసేవాడు. తనకు అనుకూలంగా వ్యవహరించనట్లయితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. ఇటీవల లైంగిక వేధింపుల కేసులో చెన్నై పద్మాశేషాద్రి పాఠశాల రాజగోపాలన్ అరెస్టు కావడంతో అప్రమత్తమైన ఓ విద్యార్థిని హబీబ్ మహ్మద్ చర్యల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది. అదే సమయంలో విద్యార్థినితో ఉపాధ్యాయుడి సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వయసుతో వచ్చే ఆశలను అణుచుకోకూడదని, పుస్తకం తీసుకుని తన ఇంటికి వస్తే పాఠం బోధిస్తానని ఉంది. దీనిగురించి విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదుగళత్తూరు పోలీసులు ఉపాధ్యాయుడు హబీబ్ మహ్మద్‌ను మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్యాయత్నం.. -
కరోనా రోగిపై లైంగిక వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌తో గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిని లైంగికంగా వేధించిన ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన 20 ఏళ్ల మహిళ కోవిడ్-19తో బాధపడుతూ శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఆ మహిళను ఆస్పత్రికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు, స్టోర్ ఉద్యోగి లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులు లవ్‌కుశ్, ప్రవీణ్‌లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్న వీరిని విధుల నుంచి తొలగించామని కోవిడ్-19 సేవలు అందిస్తున్న ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. చదవండి : రెండు నెలల్లో మహమ్మారి విజృంభణ -
పోలీసులపై నోరుపారేసుకున్న అయ్యన్నపాత్రుడు
-
ఫేస్బుక్లో పోస్ట్... ఊహించని సాయం!
-
యువతితో అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
పట్నా : ఆడపిల్లలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో నడిరోడ్డుపై కొంతమంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న యువతిని చుట్టుముట్టి అసభ్య సంభాషణలతో ఆమెను అడ్డుకున్నారు. నాలుగు వైపుల నుంచి ఆమెను చుట్టుమట్టి కదలనియకుండా చేశారు. కొంతసేపటికి ఒక వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకుని కిందపడేశాడు. కాగా కథువా, ఉన్నావ్ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను చేస్తున్నప్పటికి మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు తగ్గడం లేదు. ఆ వీడియోలో ఉన్న వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
వేదికపై సింగర్ల గొడవ
-
ఇండిగో ఉద్యోగినిపై యువకుల అసభ్య ప్రవర్తన
-
ఇండిగో ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన
శంషాబాద్ : ప్రైవేట్ ఎయిర్-క్యారియర్ ఇండిగో ఉద్యోగినిపై ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం అర్థరాత్రి మద్యం మత్తులో ఉన్న ఆ ఐదుగురు యువకులు శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఉద్యోగిని ఎయిర్‌పోర్టులో అరైవల్ ప్రాంతంలో ఉండగా వీరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అనుచితంగా మాట్లాడారు. వారి ఆగడాలను భరించలేని బాధితురాలు పక్కనే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడంతో సదరు ఉద్యోగిని వారిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు కూడా వారిపై కేసు నమోదు చేయలేదు. ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరంతా బంజారాహిల్స్, అమీర్పేట్లకు చెందిన వారిగా గుర్తించారు. ఆ యువకులు రక్షణ శాఖకు ఎలక్ట్రానిక్ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులని సమాచారం. అసభ్యంగా ప్రవర్తించారని కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరమంది -
అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు
గుంటూరు లీగల్: మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు నల్లబోయిన గోపికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ పీజే సుధ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గుంటూరు రూరల్ మండలం తోకవారిపాలెం గ్రామానికి చెందిన తెల్లమేకల వీరకుమారి పొలం పనులు చేస్తుంటుంది. సమీప మల్లవరం గ్రామానికి చెందిన నల్లబోయిన గోపికి వీరి పొలం వద్ద పొలాలు ఉన్నాయి. గోపీ తరచుగా వీరకుమారి ¿¶ ర్త గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆమె వెంట పడుతున్నాడు. ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు గోపీని మందలించారు. అయినా గోపి తన పద్ధతి మార్చు కోలేదు. 2014 సెప్టెంబర్ 21 మధ్యాహ్నం వీరకుమారి పొలంలో జొన్న గడ్డి కోస్తుండగా గోపీ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయండంతో చుట్టుపక్కల వారు రాగా పారిపోయాడు. జరిగిన సంఘటనపై వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు గోపిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితుడిపై నేరం రుజువు చేయడంతో అతనికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుధ తీర్పు చెప్పారు. -
స్కూల్ లో చిన్నారిపై అసభ్య ప్రవర్తన, కేసు నమోదు
హైదరాబాద్: ఓ ప్రైవేట్ స్కూలు సిబ్బంది విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్లోని జాన్సన్స్ గ్రామర్ స్కూల్ లో ఐదో తరగతి చదువుకున్న విద్యార్థినితో స్కూల్ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయమై బాధితురాలు తల్లిదండ్రులకు తెలిపింది. వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 354, పోస్కో సెక్షన్8 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
టెన్త్ విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన
* విద్యార్థినిని లాడ్జికి తీసుకొచ్చిన వైనం * దాడిచేసి పట్టుకున్న పోలీసులు సూర్యాపేట/ కూసుమంచి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యా ర్థినిని లాడ్జికి తీసుకొచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొం డపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన నెల్లూరి నాగేశ్వరరావు ఆరేళ్లుగా మండలంలోని నేలపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నేలపట్ల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(15)తో కొంతకాలంగా చనువు గా ఉంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సెలవుదినం కావడంతో సదరు విద్యార్థిని తన స్నేహితులతో కలసి కూసుమంచి శివాలయానికి వెళ్లింది. అక్కడి నుంచి ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి తన వెంట సూర్యాపేటకు తీసుకెళ్లాడు. ఇక్కడి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లాడ్జిపై దాడులు నిర్వహించగా నిందితుడు పరారయ్యాడు. విద్యార్థినిని సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రి కి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. కాగా విద్యార్థిని తల్లి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల ఎదుట ధర్నా కీచక ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును విధుల నుంచి తొలగించాలని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఖమ్మం జిల్లా నేలపట్ల గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం గ్రామంలోని ఆ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించారు. కీచక ఉపాధ్యాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మాస్టారు