
సాక్షి, టీ.నగర్(తమిళనాడు): విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో లైంగిక వేధింపులు చేసిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సోచట్టం కింద అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా, ముదుగళత్తూరులోగల పల్లివాసల్ ఉన్నత పాఠశాల లో సైన్స్ టీచర్‌గా హబీబ్ మహ్మద్ (36) పనిచేస్తున్నాడు. ఇతను 9, 10 తరగతి విద్యార్థినులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తూ వచ్చాడు. దీంతో వారి సెల్‌ఫోన్ నెంబర్లకు విడిగా ఫోన్ చేసి లైంగిక వేధింపులు చేసేవాడు. తనకు అనుకూలంగా వ్యవహరించనట్లయితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం.
ఇటీవల లైంగిక వేధింపుల కేసులో చెన్నై పద్మాశేషాద్రి పాఠశాల రాజగోపాలన్ అరెస్టు కావడంతో అప్రమత్తమైన ఓ విద్యార్థిని హబీబ్ మహ్మద్ చర్యల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది. అదే సమయంలో విద్యార్థినితో ఉపాధ్యాయుడి సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వయసుతో వచ్చే ఆశలను అణుచుకోకూడదని, పుస్తకం తీసుకుని తన ఇంటికి వస్తే పాఠం బోధిస్తానని ఉంది. దీనిగురించి విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదుగళత్తూరు పోలీసులు ఉపాధ్యాయుడు హబీబ్ మహ్మద్‌ను మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment