Crime News: ఈ సుత్తితోనే నా మొగుడ్ని చంపేయ్‌! | Delhi Woman Hires Man To Murder Husband Over Abusive Behaviour | Sakshi
Sakshi News home page

Crime News: ఈ సుత్తితోనే నా మొగుడ్ని చంపేయ్‌!

May 26 2022 2:13 PM | Updated on May 26 2022 2:20 PM

Delhi Woman Hires Man To Murder Husband Over Abusive Behaviour - Sakshi

తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మానవమృగంతో తాళి కట్టించుకుంది ఆమె. తప్పుడు దోవలో వెళ్తుంటే వద్దని బతిమాలుకుంది. వినలేదు సరికదా.. మరింత ఘోరంగా ప్రవర్తించబోయాడు. లాభం లేదనుకుని వదిలేయబోయింది. కానీ, తాను వదిలేసినా.. మొగుడి బుద్ధి మారదని అనుకుంది. చివరకు.. సుపారీ ఇచ్చి ఆ భర్తని ఈ లోకంలోనే లేకుండా చేసింది. 

ఢిల్లీలో కలకలం సృష్టించిన వికాస్‌ నగర్‌ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి రెండో భార్య చంద్ర కళ(28).. సుపారీ రౌడీతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు వారం తర్వాత నిర్ధారించారు. అంతేకాదు పక్కా ప్లాన్‌తో మొగుడ్ని హత్య చేయించి.. దోపిడీహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిపారు. 

ఈ సుత్తితోనే చంపేయ్‌
మృతుడు వీర్‌ బహదూర్‌ వర్మ(50) వికాస్‌ నగర్‌లో ఓ బట్టల దుకాణం నడుపుతున్నాడు. కొన్నినెలల కిందట ఆ షాపులోనే పని చేసే చంద్రకళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబంతో రాజీ చేసుకున్న వర్మ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వర్మను గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్తగా అంగీకరించింది ఆమె. 

చెల్లిపై కన్నేశాడు..
అయితే పెళ్లి అయ్యాక తనతో సవ్యంగా ఉంటాడని భావించిన ఆమెకు.. నిరాశే ఎదురైంది. పైగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. వర్మ ప్రవర్తనతో విసిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు సైతం జరిగాయి. కొన్నివారాల కిందట.. కళ సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపైనా కన్నేశాడు వర్మ. ఇది పసిగట్టిన కళ.. భరించలేకపోయింది.  కిరాయి హంతకుడి సాయంతో మొగుడ్ని చంపేందుకు ప్లాన్‌ వేసింది. 

సుపారీతో పాటు సుత్తి కూడా!
రణ్‌హోలాకు చెందిన రౌడీ షీటర్‌ జుమ్మాన్‌ను కలిసి తన వ్యధను చెప్పింది చంద్రకళ. హత్య కోసం లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా అందించింది. ఆ సుత్తితోనే మొగుడ్ని చంపేయాలని కోరింది ఆమె. ఈ క్రమంలో.. మే 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో.. సుత్తితో వర్మపై దాడి చేశాడు జుమ్మాన్‌. అనంతరం శవాన్ని రోడ్డు మీద పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వర్మను.. డీడీయూ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.

చంపి.. దొంగతనంగా. 
భర్త హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చంద్రకళ. ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్‌కు ఇచ్చి పంపించి వేసింది. మొగుడి ప్రాణం పోయినా.. తాను జైలు పాలయినా.. తన చెల్లితోపాటు ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయని కన్నీళ్లతో చెబుతోంది చంద్రకళ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement