సినిమా రేంజ్‌ ట్విస్ట్‌తో మహిళ హత్య.. నాలుగు నెలల తర్వాత.. | Gym Trainer Arrested In Kanpur Missing Woman Case | Sakshi
Sakshi News home page

సినిమా రేంజ్‌ ట్విస్ట్‌తో మహిళ హత్య.. నాలుగు నెలల తర్వాత..

Published Sun, Oct 27 2024 9:34 AM | Last Updated on Sun, Oct 27 2024 10:43 AM

Gym Trainer Arrested In Kanpur Missing Woman Case

ఢిల్లీ: కాన్పూర్‌లో ఓ మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని బయటపడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు మహిళ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త భార్యగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేసిన జిమ్‌ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ షాకింగ్‌ ఘటనపై నార్త్‌ కాన్పూర్‌ డీసీపీ శ్రవణ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని రాయ్‌పూర్వాలో ఉన్న ఓ మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద తాజాగా ఓ పని కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మృతదేహానికి పోస్టుమార్టం చేయగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త భార్య ఏక్తాగా గుర్తించాము. అయితే, ఏక్తా కనిపించడం లేదని ఆయన భర్త.. గత జూన్‌లో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.

తాజాగా ఆమె మృతిచెందడంతో అసలు ఏం జరిగిందనే కోణం విచారణ చేపట్టాం. ఈ క్రమంలో జిమ్‌ ట్రైనర్‌తో ఆమెకు పరిచయం ఉన్నట్టు గుర్తించాము. పోలీసులు దర్యాప్తులో భాగంగా అతడే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే, ఏక్తా జూన్‌ నాలుగో తేదీన నిందితుడు విమల్‌ సోనీకి కలిసేందుకు జిమ్‌కు వచ్చింది. ఈ సందర్భంగా విమల్‌ సోనికి పెళ్లి నిశ్చయం అయినట్టు తెలుసుకుంది. దీంతో, వీరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్లారు. అప్పటికీ వాగ్వాదం కొనసాగడంతో..ఆగ్రహానికి లోనైనా విమల్‌.. ఆమెకు తలపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను హత్య చేసి అక్కడ పాతిపెట్టినట్టు చెప్పారు. ఈ హత్య జరుగుతున్న సమయంలో నిందితుడి వద్ద ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు ఆలస్యమైందన్నారు. ఇదే సమయంలో మహిళ ధరించిన ఆభరణాలను అతడు తీసుకున్నాడా? లేదా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అలాగే, అసలు వీరి పరిచయం గురించి కూడా వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement