Supari killer
-
కొడుకు హత్యకు తండ్రి సుపారీ
సాక్షి, హుబ్లీ: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి భరత్ జైన్ కుమారుడు అఖిల్జైన్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. సాక్షాత్తూ తండ్రే కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకొని కుమారున్ని హత్య చేయాలని సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 1న మిస్సింగ్ అని ఫిర్యాదు వివరాలు.. అఖిల్ జైన్ ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఖిల్ గురించి ఆరా తీశారు. రకరకాల దురలవాట్లకు బానిసైన అఖిల్ గురించి ఇంట్లో వారు ఎంతో మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అఖిల్‌తో పాటు కుటుంబ సభ్యల ఫోన్ కాల్స్‌ను పరిశీలించగా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. అఖిల్ తండ్రి భరత్ కొందరు ప్రముఖ రౌడీలకు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. అఖిల్ మిస్సింగ్ ముందు అతని తండ్రి రౌడీలతో తరచూ మాట్లాడాడు. భరత్ జైన్‌ను పిలిచి విచారించగా అసలు విషయం తెలిసింది. కుమారుడిని తానే రౌడీలకు చెప్పి హత్య చేయించానని భరత్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మృతదేహం దొరకనందున పోలీసులు ఇంకా ధ్రువీకరించడం లేదు. అఖిల్ హతమై ఉంటాడని అనుమానంతో దేవరగుడిహళిలోని భరత్‌జైన్ ఫాంహౌస్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిరాయి హంతకులు దొరికితే మిస్టరీ వీడనుంది. (చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..) -
తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. రూ.8 లక్షల సుపారీతో ఖతం చేయించిన ఫ్యామిలీ
సాక్షి, హుజూర్నగర్/ఖమ్మం: సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు తేలింది. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం సీఐ రామలింగారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సాయినాథ్ (26) మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధిస్తుండగా, ఆయనను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. రాణిబాయి తమ్ముడైన మిర్యాలగూడకు చెందిన సహదేవుల సత్యనారాయణను సంప్రదించడంతో ఆయన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి, పానుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, ధరావత్ సాయికి రూ.8లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రూ.1.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈక్రమంలో రెండు సార్లు సాయినాథ్‌పై హత్యాయత్నం చేసినా విఫలమయ్యారు. మూడోసారి.. సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సహకారంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఆయనను అక్టోబర్ 17న రాత్రి ఖమ్మం నుంచి మిరాల్యగూడకు తీసుకొచ్చారు. మరుసటి రోజు కల్లేపల్లి శివారు మైసమ్మ గుడి వద్ద మద్యం తాగించి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతుడి కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి పాలకవీడు మండలంశూన్యంపహాడ్ శివారు మూసీ నదిలో వేసి వెళ్లిపోయారు. కాగా, 19వ తేదీన మృతదేహం తేలడంతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం నంబర్ ఆధారంగా... ఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఓ కారు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వాహనం నంబర్ ఆధారంగా పరిశీలించి సాయినాథ్ కారుగా తేలడంతో ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే, ఆయన తల్లిదండ్రులు అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. దీంతో అనుమానించిన పోలీసులు రామ్‌సింగ్ – రాణిబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సాయి తల్లిదండ్రులతో పాటు పాత్రధారులైన ఐదుగురిని అరెస్ట్ చేసి, నాలుగు కార్లు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై సైదులు, సిబ్బంది అంజయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, జానీ పాషాను సీఐ అభినందించారు. -
అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సమీప బంధువు ఘాతుకానికి తెగబడ్డాడు. వరుసకు తమ్ముడైన వ్యక్తిని సుపారీ కిల్లర్స్‌తో హత్య చేయించి నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నేరేడుగొమ్ము మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన రోజాతో 12సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, రాగ్య హైదరాబాద్‌లోని మణికొండలో కారు డ్రైవర్‌గా పని చేస్తూ అక్కడే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజాకు బావ వరుస అయిన ఇబ్రహింపట్నంలోని ఎల్లాపూర్‌తండాకు చెందిన లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. హత్యకు రూ.20లక్షల సుపారీ తమ సఖ్యతకు రాగ్య అడ్డుగా ఉన్నాడని లక్పతి, రోజా భావించారు. దీంతో అతడి అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లక్పతి నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్సింగ్, బాలోజీతో సుపారీ కుదుర్చుకున్నాడు. రాగ్యను హత్య చేస్తే రూ.20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. పరిచయం పెంచుకుని.. సుపారీ కుదుర్చుకున్న మాన్సింగ్, బాలోజి వైజాక్ కాలనీలో చేపల బేరం చేస్తారు. వీరు బేరం నిమిత్తం తరచూ హైదరాబాద్‌కు వెళ్లే వారు. ఈ క్రమంలో లక్పతి వద్ద రాగ్య ఫోన్ నంబర్ తీసుకుని అతడితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రథకం ప్రకారం ఆగస్టు 19న రాగ్యను హత్య చేసి మృతదేహానికి ఇనుప కడ్డీలు కట్టి కాచరాజుపల్లి సమీపంలో సాగర్ వెనుక జలాల్లో పడవేశారు. చదవండి: బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది విషాదంలో రాగ్య తల్లిదండ్రులు, పక్కన రాగ్య (ఫైల్) హైదరాబాద్‌లో కేసు నమోదు.. సెల్‌ఫోన్ ఆధారంగా.. రాగ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 21న హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగ్య తరచూ ఫోన్లో మాన్సింగ్, బాలోజీతో సంభాషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోందంత వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మాన్సింగ్, బాలోజీలను తీసుకుని కాచరాజుపల్లికి తీసుకువచ్చారు. కృష్ణా వెనుక జలాల్లో మృతదేహం కోసం గాలించగా సాయంత్రం వరకు లభ్యం కాలేదు. ఈ క్రమంలో నిందితులను తమకు అప్పగించాలని అక్కడికి చేరుకున్న రాగ్య కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాళ్లు రువ్వడంతో రాగ్య బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు సోమవారం రాగ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపడతామని అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, రాగ్యను ఎక్కడ ఎలా హత్య చేశారు. హత్యోదంతంలో ఎంత మంది పాత్రధారులు? ఇందులో రాగ్య భార్య రోజా పాత్ర ఏ మేరకు ఉంది.? తదితర విషయాలు దర్యాప్తులో తేలుతాయని నేరేడుగొమ్ము పోలీసులు పేర్కొంటున్నారు. -
ఆస్తి పంచాయితీ.. రూ.50 వేలు సుపారీ ఇచ్చి సొంత తమ్ముడినే..
యశవంతపుర: అక్క సొంత తమ్మున్ని హత్య చేయించిన ఘటన కలబురిగిలో జరిగింది. నగరంలోని గాజీపూర లేఔట్‌కు చెందిన నాగరాజ్ మటమారి జులై 28న కలబురిగి నగరం నుండి ఆళంద వెళ్తూ మార్గమధ్యలో కెరెభూసగా గ్రామం వద్ద శవమై తేలాడు. దుండగులు తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ తానే ఈ హత్య చేశానని పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆస్తి కలహాలతో నాగరాజ్ అక్క సునీత రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయిందని చెప్పాడు. కేసు విచారణలో ఉంది. -
Crime News: ఈ సుత్తితోనే నా మొగుడ్ని చంపేయ్!
తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మానవమృగంతో తాళి కట్టించుకుంది ఆమె. తప్పుడు దోవలో వెళ్తుంటే వద్దని బతిమాలుకుంది. వినలేదు సరికదా.. మరింత ఘోరంగా ప్రవర్తించబోయాడు. లాభం లేదనుకుని వదిలేయబోయింది. కానీ, తాను వదిలేసినా.. మొగుడి బుద్ధి మారదని అనుకుంది. చివరకు.. సుపారీ ఇచ్చి ఆ భర్తని ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఢిల్లీలో కలకలం సృష్టించిన వికాస్ నగర్ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి రెండో భార్య చంద్ర కళ(28).. సుపారీ రౌడీతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు వారం తర్వాత నిర్ధారించారు. అంతేకాదు పక్కా ప్లాన్‌తో మొగుడ్ని హత్య చేయించి.. దోపిడీహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిపారు. ఈ సుత్తితోనే చంపేయ్ మృతుడు వీర్ బహదూర్ వర్మ(50) వికాస్ నగర్లో ఓ బట్టల దుకాణం నడుపుతున్నాడు. కొన్నినెలల కిందట ఆ షాపులోనే పని చేసే చంద్రకళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబంతో రాజీ చేసుకున్న వర్మ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వర్మను గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్తగా అంగీకరించింది ఆమె. చెల్లిపై కన్నేశాడు.. అయితే పెళ్లి అయ్యాక తనతో సవ్యంగా ఉంటాడని భావించిన ఆమెకు.. నిరాశే ఎదురైంది. పైగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. వర్మ ప్రవర్తనతో విసిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు సైతం జరిగాయి. కొన్నివారాల కిందట.. కళ సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపైనా కన్నేశాడు వర్మ. ఇది పసిగట్టిన కళ.. భరించలేకపోయింది. కిరాయి హంతకుడి సాయంతో మొగుడ్ని చంపేందుకు ప్లాన్ వేసింది. సుపారీతో పాటు సుత్తి కూడా! రణ్‌హోలాకు చెందిన రౌడీ షీటర్ జుమ్మాన్‌ను కలిసి తన వ్యధను చెప్పింది చంద్రకళ. హత్య కోసం లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా అందించింది. ఆ సుత్తితోనే మొగుడ్ని చంపేయాలని కోరింది ఆమె. ఈ క్రమంలో.. మే 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో.. సుత్తితో వర్మపై దాడి చేశాడు జుమ్మాన్. అనంతరం శవాన్ని రోడ్డు మీద పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వర్మను.. డీడీయూ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చంపి.. దొంగతనంగా. భర్త హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చంద్రకళ. ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్‌కు ఇచ్చి పంపించి వేసింది. మొగుడి ప్రాణం పోయినా.. తాను జైలు పాలయినా.. తన చెల్లితోపాటు ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయని కన్నీళ్లతో చెబుతోంది చంద్రకళ. -
భర్తతో విసిగిపోయిన భార్య .. సుపారీ ఇచ్చి.. పక్కా ప్లాన్‌తో
సాక్షి, (భీమిలి)విశాఖపట్నం: గంజాయికి బానిసైన భర్త రోజూ రాత్రి ఇంటికొచ్చాక గొడవపడడం.. పిల్లలను, తనను కొట్టి వేధిస్తుండడంతో భరించలేని మహిళ భర్త పీడ వదిలించాలని సోదరుని కోరడంతో తను సుపారీ గ్యాంగ్ సాయంతో హతమార్చేశాడు. మండలంలోని గంభీరం పంచాయతీ కల్లివానిపాలెంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన పిల్లి పైడిరెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. ఆరుగురిని గురువారం అరెస్ట్ చేశారు. ఈ హత్యకు భార్యే సూత్రధారి అని గుర్తించారు. ఆనందపురం సీఐ వై.రవి తెలిపిన వివరాల ప్రకారం... ఆటో నడుపుతూ జీవనం సాగించే పిల్లి పైడిరెడ్డి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో గంజాయి కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవించాడు. కరోనా ఉధృతి సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గంజాయికి బానిసై భార్య అప్పలకొండమ్మను శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురిచేసేవాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి మత్తులో భార్య, పిల్లలతో గొడవ పడి కొట్టేవాడు. పైడిరెడ్డి బాధలు భరించలేక అప్పలకొండమ్మ తన కన్నవారి ఇంటికి వెళ్లి భర్త పీడ వదిలించాలని కోరింది. దీంతో పైడిరెడ్డిని అంత మొందించడానికి అప్పలకొండమ్మ సోదరుడు కొల్లి శ్రీనివాసరావు పథక రచన చేశాడు. ఈ మేరకు సుపారీ గ్యాంగ్‌ని ఆశ్రయించి రూ.4లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకొని రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. చదవండి: బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం.. చిన్న విషయాలకే భయం అంటూ.. వారం రోజుల నుంచి ప్రణాళిక ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పైడిరెడ్డిని హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్ యత్నించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పైడిరెడ్డి భార్య అప్పలకొండమ్మ, తల్లి సూరమ్మ ఇంటి వద్దే ఉన్నారు. వేరే గదిలో పైడిరెడ్డి నిద్రపోయాడు. ప్రణాళికలో భాగంగా కొత్తపరదేశి పాలెం గ్రామానికి చెందిన పల్లా దుర్గారావు(20) ఇంటి బయట కత్తి పట్టుకొని కాపలా ఉండగా, ఆనందపురం మండలం, బోయిపాలెం గ్రామానికి చెందిన అప్పలకొండ సోదరుడు కొల్లి శ్రీనివాసరావు(23), కొత్త పరదేశి పాలెం గ్రామానికి చెందిన బోర ఆదిబాబు(27), భీమిలి మండలం కృష్ణా కాలనీకి చెందిన బంగారి గణేష్(30), వలస అప్పలరాజు(31) అర్ధరాత్రి వేళ ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించారు. పైడిరెడ్డి తల్లి సూరమ్మను శ్రీనివాసరావు, ఆదిబాబు, అప్పలరాజు బంధించారు. సోపాసెట్‌పై నిద్రిస్తున్న పైడిరెడ్డి తలపై గణేష్ రాడ్డుతో కొట్టి, కత్తితో పీక కోశాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ముందుగా మృతుని భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. భర్త వేధింపులు తాళలేక తానే హత్యకు పురిగొల్పినట్టు అంగీకరించింది. ఈ మేరకు పూర్తి విచారణ జరిపిన పోలీసులు వెల్లంకిలోని ఓ పాఠశాల వెనుకవైపు మామిడి తోటలో నిందితులు ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పలకొండమ్మనూ అరెస్ట్ చేశారు. చదవండి: కాన్పు చేసిన నర్సులు.. బిడ్డతో సహా గర్భిణి మృతి నిందితుల నుంచి స్టీలు రాడ్డు, కత్తి, రెండు మోటారు సైకిళ్లు, 6 ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పైడిరెడ్డి మరణం, అప్పలకొండమ్మ జైలుపాలవడంతో వారి కుమారుడు, కుమార్తె దిక్కులేనివారయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, పదో తరగతి చదువుతున్న వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మరోవైపు వృద్ధురాలైన పైడిరెడ్డి తల్లి సూరమ్మకు కుమారుడి మృతితో ఆసరా లేకుండా పోయింది. -
మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్): కష్టాల్లో నుంచి వచ్చిన వారిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి సంపాదించుకున్నారు. జీవితంలో స్థిరపడ్డామని సంతోషించేలోపే భర్త పక్కదారి పట్టాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా మారని భర్త తీరుతో విసిగిన ఆ భార్య ఏకంగా సుపారీ ఇచ్చి మరీ.. హత్యచేయించింది. ఆ శవమే ఈనెల 23న నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకపూర్ సమీపంలోని వాగులో లభ్యమైంది. అన్నికోణాల్లో విచారణ చేసిన జిల్లా పోలీసులు వారం రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో కలుసుకుని.. కంచికట్ల శ్రీనివాస్(42) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుచానూరు. తనకంటూ ఎవరూ లేని అనాథ కావడంతో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతూ స్థిరపడ్డాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట్ గ్రామానికి చెందిన స్వప్నకు పెళ్లై.. ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుంది. అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఓ బట్టల దుకాణంలో పనిలో చేరింది. ఈక్రమంలో శ్రీనివాస్, స్వప్నల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమపెళ్లికి దారితీసింది. వీరికి కొడుకు, బిడ్డ జన్మించారు. సంపాదించిన డబ్బులతో మరో ఆటో కొన్నారు. అక్కడే స్నేహితుల ద్వారా క్రమంగా శ్రీనివాస్ రియల్ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో కలిసిరావడంతో ఉప్పల్ ఒక ఇల్లు, వేంపేట్‌లో మరో ఇల్లు నిర్మించుకున్నారు. ఇక అంతా బాగానే ఉంది.. చక్కగా స్థిరపడ్డాం.. అనుకునేలోపే వారి ప్రయాణం మరో మలుపు తిరిగింది. ఆమె రాకతో.. ఆర్థికంగా స్థిరపడ్డ శ్రీనివాస్ విలాసాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో నందిని అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి స్వప్న ఆత్మహత్యాయత్నం వరకూ వెళ్లడంతో నందిని దూరంపెట్టాడు. కానీ.. ఆ కోపం ప్రతిరోజూ తాగివచ్చి భార్యాపిల్లలపై చూపేవాడు. నిత్యం తాగొచ్చి తనతోపాటు తన పిల్లలను శ్రీనివాస్ హింసించేవాడు. దీంతో విసిగిపోయిన స్వప్న భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది. తన కొడుకులు తరుణ్, రాజ్‌కుమార్, తన అక్క కొడుకు పోశెట్టికి భర్తను మట్టుపెట్టాలని కోరింది. హత్య చేయడం తమతో కాదని, ఇతరులకు సుపారీ(డబ్బులు) ఇచ్చి అంతమొందిద్దామని వారు సలహా ఇచ్చారు. ఈమేరకు పోశెట్టి తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్‌కుమార్ ద్వారా సుపారీ గ్యాంగ్‌ను హైదరాబాద్‌కు పిలిపించారు. రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం వేంపేట్‌కు.. హైదరాబాద్‌లో హత్యచేస్తే సులభంగా దొరికిపోతామని, మృతదేహం తరలించడం కూడా కష్టమవుతుందని సుపారీ గ్యాంగ్ చెప్పడంతో మర్డర్ స్పాట్‌ను వేంపేట్‌కు మార్చారు. ఈమేరకు ఈనెల 22న రాత్రి వేంపేట్‌కు వెళ్దామని భర్త శ్రీనివాస్‌ను తీసుకుని కుటుంబ సమేతంగా రాత్రి 9 గంటలకు వచ్చారు. ఈ సమాచారాన్ని ప్రవీణ్‌కుమార్ ద్వారా సుపారీ గ్యాంగ్ సభ్యులైన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపే, నిర్మల్ జిల్లా ఖానాపూర్, మెదక్ జిల్లాకు చెందిన బాణాల అనిల్, కంచర్ల మహావీర్, మ్యాతరి మధు, కొలనూరి సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్‌కు అందించారు. వీరంతా గంట వ్యవధిలో వేంపేట్‌కు చేరుకున్నారు. మర్డర్ ప్లాన్ తన కుమార్తెకు విషయం తెలియనివ్వకుండా స్వప్న ఆ రోజు రాత్రి ఆమెను పక్కింట్లో పడుకోబెట్టింది. రాత్రి 11 గంటలకు సుపారీ గ్యాంగ్ స్వప్న ఇంటికి వచ్చింది. నిద్రపోతున్న శ్రీనివాస్‌పై గ్యాంగ్‌తోపాటు కొడుకులు, భార్య రోకలిబండ, కర్రలతో బలంగా కొట్టడంతో చనిపోయాడు. అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదనడంతో సుపారీగ్యాంగ్ మృతుడి ఒంటిపై ఉన్న అభరణాలను తీసుకెళ్లారు. తనిఖీలు ఉండడంతో.. శ్రీనివాస్ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి నిర్మల్ జిల్లాలోని అటవీప్రాంతంలో పూడ్చేసేందుకు పోశెట్టి, రాజ్‌కుమార్, చిక్కా ముగ్గురు కారులో బయలుదేరారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ అటవీశాఖ కేంద్రం వద్ద తనిఖీలు చేస్తుండటంతో దొరికిపోతామని భయపడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కనకాపూర్ వాగులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. శ్రీనివాస్ కనిపించకపోవడంతో అడిగినవాళ్లకు ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు స్వప్న చెబుతూ వచ్చింది. ఈనెల 23న గుర్తుతెలియని శవంగా బయటపడిన ఘటనను స్థానిక పోలీసులు నమోదు చేసుకుని నిర్మల్‌తోపాటు జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకూ సమాచారం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా జిల్లాల్లోనూ శ్రీనివాస్ ఫొటో ద్వారా ఆరాతీయించి సఫలమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు మొత్తం కూపీలాగి ఈ ఘటనలో మొత్తం 13 మందిని నిందితులుగా తేల్చారు. ఇందులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు. వెంకటేశ్, శ్రీకాంత్, రాజేందర్ పరారీలో ఉన్నారు. హత్యకు ఆయుధాలు, మృతదేహం తరలింపునకు ఉపయోగించిన కారు, నిందితులు ఉపయోగించిన పది సెల్ఫోన్లు, మృతుడికి చెందిన 72 గ్రాముల అభరణాలు, రూ.75వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వివరించారు. తక్కువ వ్యవధిలో ఈ కేసును ఛేదించిన సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్ రూరల్ ఎస్సైలు రాహుల్, వినయ్, అశోక్, సిబ్బందిని అభినందించారు. చదవండిః మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు -
పొరపాటున.. దారుణ హత్య
సాక్షి, శివమొగ్గ(కర్ణాటక): పాతకక్షలతో ఒక వ్యక్తిని చంపాలని ప్రత్యర్థులు పథకం వేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రాకపోగా అక్కడికి వచ్చిన సంతోష్ (32) అనే మరో అమాయకున్ని ప్రాణాలు తీశారు. శివమొగ్గ నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాపూజీ నగర లేఔట్లో ఆయుధ పూజ అయిన గురువారం రాత్రి నలుగురు దుండగులు కాపుకాశారు. ఒకరు అవెంజర్ బైకులో వస్తాడని, అతన్ని వేసేయాలని దుండగులకు సుపారీ ఇచ్చిన వ్యక్తి చెప్పాడు. ఆ సమయంలో సంతోష్ స్నేహితుని ఇంట్లో భోజనం చేసి సమీపంలో ఉన్న బైక్ వద్దకు వెళ్తుండగా హంతకులు చూశారు. తాము చంపాల్సిన వ్యక్తి ఇతడేననుకుని కత్తులతో హత్యచేసి పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. -
ప్రతీకార హత్యకు ప్లాన్ చేసిన నిందితులు..
సాక్షి, కోదాడ(సూర్యాపేట): తన అన్నను చంపిన వాడిని చంపాలని హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తితో పాటు సుపారీ గ్యాంగ్‌ను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మంగళవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డి వెల్లడించారు. కోదాడ మండలం నల్ల బండగూడెం శివారు రామాపురం క్రాస్ రోడ్‌కు చెందిన గుగులోతు సురేష్ గతేడాది సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో డీజే నడిపిస్తూ అక్కడ బస్వరాజు తిరపతయ్యను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి ఇంటిలో అద్దెకు ఉంటూ ఆయన భార్యతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. గమనించిన తిరపతయ్య అతడిని మందలించాడు. దీంతో అడ్డుగా ఉన్న అతడిని ఎలాగైనా హత్యచేయాలని సురేష్ స్నేహితుల సాయంతో తిరపతయ్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ కేసులో జైలు వెళ్లి వచ్చి స్వగ్రామంలో ఉంటున్నాడు. అన్నను చంపిన వాడిని హత్య చేయాలని.. తన అన్నను చంపిన వాడిని హత్యచేయాలని తిరపతయ్య తమ్ముడు జనార్దన్ తనకు పరిచయం ఉన్న ఖమ్మం జిల్లా దాచేపల్లికి చెందిన దాచేపల్లి సురేష్ సాయంతో చెర్వుమాదారంకు చెందిన రఫీతో గుగులోతు సురేశ్‌ను హత్య చేయడానికి రూ.2.50 లక్షల సుపారీ కుదుర్చుకుని ఫొటోను వివరాలను ఇ చ్చాడు. రఫీకి అడ్వాన్‌గా రూ.34వేలను గూ గుల్ పే ద్వారా పంపించాడు. దాచేపల్లి సురేశ్ రఫీలు ఇద్దరు కలిసి గుగులోతు సురేశ్ ను హత్య చేయడానికి అతడి ఇంటి రెక్కీ నిర్వహించి హత్యకు కావాల్సిన వేటకొడవళ్లను రోడ్డు వెంట భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రఫీ తన గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడైన రాకేశ్‌కు డబ్బు ఆశ చూపి అతడిని కూడా ఒప్పించి, తరువాత తమ వాళ్ల కాదని, తన గ్రామస్తుడైన ఏసోబుకు చెప్పగా అతడు హైదరాబాద్‌లోని పల్లపు నరేందర్ గ్యాంగ్ ఉందని చెప్పి అతడితో లక్ష రూపాయాలకు ఒప్పందం చేసుకుని రూ.4వేలు ఇచ్చారు. ఆ తర్వాత నరేందర్ గ్యాంగ్ ఈ నెల 23న ఏసోబుతో కలిసి హత్య చేసేందుకు రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకుని రఫీకి ఫోన్ చేయగా అతడు ఎత్తకపోవడంతో సురేశ్ అడ్రస్ తెలియపోవడంతో వెళ్లిపోయారు. హత్య ఆలస్యం అవుతుందని జనార్దన్ ఒత్తిడి చేస్తుండటంతో 24 రాత్రి ఒంటి గంట సమయంలో రఫీ, రాకేష్‌ను తీసుకుని ద్విచక్రవాహనంపై రామాపురం క్రాస్‌రోడ్‌లోని గుగులోతు సురేశ్ ఇంటికి వెళ్లి సురేశ్ తల్లిని మీ కొడుకు లేడా అని కత్తులతో బెదిరించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేవరకు పరారయ్యారు. ఈ క్రమంలో ఒక కత్తి కిందపడిపోయింది. ఈ సంఘటనపై సురేష్ తల్లి రాంబాయి ఈ నెల 25న రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వి చారణ చేపట్టారు. ఎలాగైన అతడిని చంపాలని రఫీ, రాకేశ్‌లు రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు రాగా పోలీసులు పట్టుకుని వారిని వి చారించి అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రెండు కత్తులు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతం చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ వై. సైదులుగౌడ్‌ను, సిబ్బందిని సీఐ అభినందించారు. -
మరదలిపై కన్నేసి తోడల్లుడిని చంపించాడు!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో ఈ నెల మొదటి వారంలో చోటు చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్ష్మణ్‌కుమార్ హత్య కేసులో అక్కడి పోలీసులు నగరానికి చెందిన హతుడి బంధువైన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్యప్రసాద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరదలిపై కన్నేసిన సత్యప్రసాద్ ఆమెను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తోడల్లుడిని చంపించినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. ఇందుకుగాను హైదరాబాద్‌లో నివసిస్తున్న బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌కు రూ.15 లక్షల సుపారీ ఇచ్చినట్లు బెంగళూరులోని మహదేవ్పుర పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ అశ్విత్ నారాయణస్వామి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. ‘లక్ష్మణ్ ఫొటోలను ఫేస్బుక్ నుంచి సేకరించిన సత్య... అతడి లోకేషన్స్‌ను వాట్సాప్ ద్వారా దీపక్‌కు పంపాడని గుర్తించామని, ఈ కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు’ఆయన వివరించారు. రెండు దఫాల్లో ఈ అరెస్టులు జరిగాయని, సత్యప్రసాద్‌ను మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. మరదలిపై కన్నేసి... నెల్లూరుకు చెందిన సత్యప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఇతడికి 2006లో గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు మాదాపూర్‌లో ఉంటూ వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. సత్య భార్య సోదరి శ్రీజకు గుంటూరుకు చెందిన లక్ష్మణ్‌కుమార్‌తో 2016లో వివాహం జరిగింది. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ప్రస్తుతం భార్యభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శ్రీజపై కన్నేసిన సత్య ఆమెను లోబరుచుకోవాలని భావించాడు. ఈ విషయం మరదలి కి కూడా చెప్పని అతను లక్ష్మణ్ కుమార్‌ను హత్య చేస్తే ఆమె తనకు సొంతమవుతుందని భావిం చాడు. దీంతో పలుమార్లు బెంగళూరు వెళ్లిన సత్య హత్యలు చేసే ముఠాల కోసం ప్రయత్నించాడు. లక్ష్మణ్ ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లో సేవ్ చేసుకున్నాడు. ఫేస్బుక్ నుంచి ఫొటో డౌన్లోడ్ చేసి... సుపారీ తీసుకుని రంగంలోకి దిగిన దినేష్.. సత్య నుంచి లక్ష్మణ్ పొటో, ఇతర వివరాలను తీసుకున్నాడు. గత జూలై 16న బెంగళూరు వెళ్లిన దినేష్.. లక్ష్మణ్‌పై దాడి చేశాడు. మెడపై కత్తితో దాడి చేసినా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనిపై స్థానిక హెన్నూర్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ తర్వాత దినేష్ హైదరాబాద్‌కు వచ్చేయడంతో కేసు పెండింగ్‌లోనే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెలలో లక్ష్మణ్‌ను ఎట్టి పరిస్థితుల్లో హత్య చేయాల్సిందిగా సత్య ఒత్తిడి చేయడంతో తన భార్యతో కలసి గత నెల రెండో వారంలో బెంగళూరు వెళ్లిన దినేష్ అక్కడి దేవనహల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. మరోసారి ఫేస్బుక్ నుంచి లక్ష్మణ్ ఫొటోను డౌన్లోడ్ చేసిన సత్య దానిని దినేష్‌కు పంపాడు. అయితే లక్ష్మణ్ తన తోడల్లుడనే విషయాన్ని మాత్రం దినేష్‌కు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. మరో ఏడుగురితో కలసి హత్య... బెంగళూరులోని పలు ప్రాంతాలకు చెందిన స్నేహితులు ప్రశాంత్, ప్రేమ్, లోకేష్, కుష్వంత్, సంతోష్, రవిలను దినేష్ తనతో కలుపుకున్నాడు. 2 కార్లు, 4 బైక్‌లతో రంగంలోకి దిగిన ఈ ముఠా గత నెల 30, 31 తేదీల్లో లక్ష్మణ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నెల 3న లక్ష్మణ్ ఇంటి వద్ద కాపుకాసిన ఈ గ్యాంగ్ అతడు ఆఫీస్‌కు బయలుదేరినప్పటి నుంచి వెంబ డించింది. మహదేవ్పుర ఫ్లైఓవర్ వద్ద అతడిని అడ్డగించి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న సత్య ఏమీ ఎరుగనట్లు తన భార్యను తీసుకుని హుటాహుటిన బెంగళూరు వెళ్లాడు. లక్ష్మణ్ హత్య కేసుకు సంబంధించి మహదేవ్పుర ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రతి ని కూడా అతడే తీసుకున్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రశాంత్, ప్రేమ్ తదితరులను అరెస్టు చేశారు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో రాజేంద్రనగర్‌కు వచ్చి దినేష్, సవిత ను అదుపులోకి తీసుకున్నారు. తనకు సత్య సుపారీ ఇచ్చాడని దినేష్ చెప్పడంతో మంగళవారం రాత్రి మాదాపూర్‌కు వచ్చిన మహదేవ్పుర పోలీసులు అతడినీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు. క్యాబ్ డ్రైవర్‌కు సుపారీ ఇచ్చి... బెంగళూరులోని బోయప్పనహల్లి ప్రాంతానికి చెందిన దినేష్ కొన్నేళ్ల క్రితం అక్కడి సయీదాని ప్రేమించాడు. వీరి పెళ్లికి ఆమె కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. సవితగా ఆమె పేరు మార్చి రాజేంద్రనగర్ బండ్లగూడలోని వికాస్‌నగర్ కాలనీలో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఇతను సత్యప్రసాద్ పని చేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. అప్పట్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దినేష్ గురించి తెలుసుకున్న సత్య తన తోడల్లుడు లక్ష్మణ్‌ను చంపడానికి సుపారీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన శత్రువు ఒకరు బెంగళూరులో ఉంటున్నాడని దినేష్‌తో చెప్పిన సత్య అతడిని హత్య చేస్తే రూ.15 లక్షలు, హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఇందుకు అంగీకరించిన దినేష్ ముందుగా రూ.1.5 లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడు. -
భర్త హత్యకు భార్య సుపారీ
బెంగళూరు, హొసూరు: ఇదేదో సినిమా కథ కాదు, కానీ కొంచెం అలాగే ఉంటుంది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో రౌడీల నుంచి భర్తను హత్య చేసేందుకు యత్నించిన ఘటనలో రౌడీని మత్తూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు అణ్ణానగర్‌కు చెందిన మాదేష్ (32). ఇతని భార్య (27). వీరికి 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గలాటాలు జరుగుతున్నాయి. దీనితో భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. అందుకు అత్తిపల్లంకు చెందిన ప్రముఖ రౌడీ విష్ణును సంప్రదించి రూ. 2 లక్షలకు కిరాయి కుదుర్చుకుని రూ. 30 వేలు అడ్వాన్స్ డబ్బులిచ్చింది. భర్తను కలిసిన రౌడీ రౌడీ విష్ణు మనసులో మరో ఆలోచన పుట్టింది. ఆమె భర్త మాదేష్‌ను కలిసి నీ భార్య నిన్ను హత్య చేసేందుకు నాకు డబ్బులిచ్చింది, నాకు రూ. 3 లక్షలు ఇవ్వు. నిన్న హత్య చేసేందుకు యత్నిస్తాం, ఆ సమయంలో నీవు తప్పించుకొని వెళ్లిపో అని తెలిపాడు. దీంతో జాగ్రత్తపడిన మాదేశ్ తన అనుచరులు 10 మందిని తీసుకొని వెళ్లి విష్ణును పట్టుకుని మత్తూరు పోలీసులకు అప్పగించాడు. పోలీసులు విష్ణును అతన్ని అరెస్టు చేసి నిజంగానే భర్తను హత్య చేసేందుకు ఆమె డబ్బులిచ్చిందా, లేక మాదేష్ వద్ద డబ్బులు లాక్కొనేందుకు ఈ నాటకమాడారా అన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. -
పాత కక్షలతోనే ‘నడిరోడ్డు’పై హత్య
పటాన్చెరు టౌన్: పట్టపగలు జాతీయ రహదారిపై ఒక వ్యక్తిని హత్య కేసులో నిందితుడు ఖలీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్య కోసం నిందితుడు రూ.6 లక్షలు సుపారీ తీసుకున్నట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలో గత నెల 31న హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన మహబూబ్ హుస్సేన్ (25)ను నడిరోడ్డుపై కొబ్బరి బోండాల కత్తితో హత్య చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా బియ్యం రవాణా చేసే వాళ్లలో ఒక వర్గానికి, మరో వర్గానికి పడకనే లక్డారంలో గత నవంబర్‌లో జరిగిన హర్షద్ హత్యకు ప్రతీకారంగా అతడి సోదరులు మహబూబ్‌ను హత్య చేయించినట్లు తెలిసింది. నిందితులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన వారుగా సమాచారం. ప్రధాన నిందితుడి నుంచి పోలీసులు ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మహబూబ్ హత్య కేసులో 10 మందికిపైగా ఉన్నారని సమాచారం. హత్య చేస్తున్న సమయంలో రోడ్డుకు అవతలి వైపు కారులో కొందరు, మరి కొందరు ద్విచక్ర వాహనాలపై ఉన్నట్లు తెలిసింది. రెండు మూడ్రోజుల్లో నిందితులను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ రాజేశ్వర్‌రావును వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందన్నారు. నిం దితుడి అరెస్ట్‌ను ఆయన ధ్రువీకరించలేదు. -
ప్రణయ్ హత్య కేసు : హత్య చేసిన శర్మ అరెస్ట్
-
ప్రణయ్ హత్య కేసులో.. సుపారీ కిల్లర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు హత్య చేయించాడు. ఈ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉండగా బారీ తన గురువు అస్గర్ అలీతో ప్లాన్ చేసి బిహార్‌లోని సంస్థాన్ పూర్ జిల్లాకు చెందిన శర్మను ఈ ఆపరేషన్‌కు వినియోగించాడు. బిహార్‌లో అదుపులోకి తీసుకున్న శర్మను పోలీసులు నల్గొండ తరలిస్తున్నారు. హత్య జరిగిన రోజు శర్మతో పాటే అస్గర్ ఆసుపత్రికి వచ్చినట్టుతెలుస్తోంది. తన కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్గర్ డబ్బు కోసం ఈ డీల్ ఒప్పుకున్నట్టు సమాచారం. -
ఆస్తులు దక్కనివ్వడం లేదని.. సొంత అన్నకూతురు
బంజారాహిల్స్:కిరాయి హంతకులతో సొంత బాబాయ్‌ను అంతమొందించేందుకు యత్నించిన ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు మరో నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్. శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్రావు వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని ప్రశాసన్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తన అన్న ప్రేమాచారి కూతురు మంజులతో కలిసి కొన్నిచోట్ల స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా గుంటూరులో రూ.15 కోట్ల వ్యయంతో ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. 2009లో గుంటూరులో రూ. 30 కోట్ల విలువ చేసే ఓ ప్లాట్‌ను ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఘట్కేసర్లో ఇద్దరూ కలిసి 25 ఎకరాల స్థలం కొనుగోలు చేయగా ఆ స్థలాన్ని దయాచారి తన అత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆమె చనిపోయిన తర్వాత మంజులకు తెలియకుండా తన పేరున బదలాయించుకున్నాడు. సింగపూర్‌లో వ్యాపార నిమిత్తం మంజుల తల్లి నుంచి రూ. 60 లక్షల వరకు తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా భాగస్వామ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా చేశాడు. దీనిపై మంజుల ఎన్నిసార్లు అడిగినా ససేమీరా అన్నాడు. వారం క్రితం మంజుల తన కుమారుడు, అన్న కొడుకుతో కలిసి దయాచారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడగా, ఇంట్లోకి కూడా రానివ్వలేదు. దీంతో విసుగు చెందిన మంజుల బాబాయ్ అడ్డు తొలగించుకుంటేనే భాగస్వామ్యంలో ఉన్న ఆస్తులు తనకు దక్కుతాయని పథకం వేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాపార భాగస్వామి వెంకటేశ్వరరావుకు విషయం చెప్పడంతో ఆయన విజయవాడకు చెందిన నరేష్‌కు ఈ బాధ్యత అప్పగించాడు. నరేష్ తనకు తెలిసిన నలుగురు కిరాయి హంతకులు ఉన్నారని వారు బెదిరిస్తారని చెప్పడంతో రూ.15 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ నెల 3న కిరాయి హంతకులు అశోక్, సాగర్, అయ్యప్ప, రాజేష్, కొండాపూర్‌లో బసచేసి ఈ నెల 4న ఉదయం వాకింగ్ చేస్తున్న దయాచారిని తమతో పాటు తెచ్చుకున్న క్రికెట్ వికెట్‌తో తలపై బలంగా మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. జూబ్లీహిల్స్ సీఐ చంద్రశేఖర్, డీఐ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వివరాల ఆధారంగా మంజుల, ఆమె సోదరుడు కరుణాకర్, నరేష్, అశోక్, సాగర్లను అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరరావు, అయ్యప్ప, రాజేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాల్పుల కేసులో కిల్లర్ బాబు అరెస్ట్
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై కాల్పుల కేసులో హాస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు, సుపారీ కిల్లర్ డక్కల బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా తాను లొంగిపోతానంటూ మీడియాకు ఫోన్లు చేస్తున్న బాబు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపాయాడు. మూడ్రోజుల క్రితం కాంగ్రెస్ నేత యాదగిరిపై బాబు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలు కిల్లర్ బాబుకు ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సుపారీ కిల్లర్ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ( చదవండి: 'కిల్లర్ బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది') -
'కిల్లర్ బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది'
హైదరాబాద్: హాస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు, సుపారీ కిల్లర్ డక్కల బాబు నుంచి తనకు ప్రాణ హాని ఉందని కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కాల్పుల కేసులో డాకూరి బాబును పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. సినీఫక్కీలో యాదిగిరిపై బాబు జరిపిన కాల్పుల వేట ఈ నెల 13న బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాల్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాదగిరికి బుల్లెట్ తగలడంతో ఆ గాయాలతోనే ఆస్పత్రికి వెళ్లి అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే యాదగిరిని విచారించేందుకు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.