రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు హత్య చేయించాడు.