
'కిల్లర్ బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది'
హైదరాబాద్: హాస్మత్‌పేటకు చెందిన పాత నేరగాడు, సుపారీ కిల్లర్ డక్కల బాబు నుంచి తనకు ప్రాణ హాని ఉందని కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కాల్పుల కేసులో డాకూరి బాబును పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. సినీఫక్కీలో యాదిగిరిపై బాబు జరిపిన కాల్పుల వేట ఈ నెల 13న బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
కాల్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాదగిరికి బుల్లెట్ తగలడంతో ఆ గాయాలతోనే ఆస్పత్రికి వెళ్లి అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే యాదగిరిని విచారించేందుకు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.