Telangana Crime News: అప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రి.. చివరికి అనాథలైన పిల‍్లలు!
Sakshi News home page

అప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రి.. చివరికి అనాథలైన పిల‍్లలు!

Published Sun, Aug 20 2023 6:16 AM | Last Updated on Sun, Aug 20 2023 9:58 AM

- - Sakshi

సంగారెడ్డి: తల్లిదండ్రుల మృతితో ఆ పిల్లలను రోడ్డున పడేశాయి. అనారోగ్యంతో రెండేళ్ల కిందట తల్లి చనిపోగా.. అదే అనారోగ్యం తండ్రినీ పొట్టనపెట్టుకుంది. దీంతో ముగ్గురు చిన్నారుల పరిిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.

దౌల్తాబాద్‌ మండలం ఇందుప్రియాలకు చెందిన దొడ్డి యాదగిరి (42), రేణుక (35)లకు ముగ్గురు ఆడపిల్లలు. 2021లో రేణుక అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి పిల్లల బాగోగులు తండ్రి చూసుకునేవాడు. అంతలోనే యాదగిరి తల్లి బాల ఎల్లవ్వ కూడా మృతిచెందింది. కాగా కొద్దిరోజులుగా యాదగిరి కూడా మంచం పట్టాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతిచెందాడు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.

తల్లిదండ్రులతో పాటు నానమ్మ కూడా మృతిచెందడంతో చిన్నారులు అనాథలయ్యారు. శిరీష 8వ తరగతి, శ్రావణి నాలుగు, రిషిక రెండో తరగతి చదువుతున్నారు. పిల్లల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ఎవరూ లేని ఈ పిల్లలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాతలు సాయం అందించాలనుకుంటే 9550940672లో సంప్రదించాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement