అమానుషం: ఆటో డ్రైవర్‌పై మూత్ర విసర్జన  | Doctor Cruel Behaviour On Auto Driver In Karnataka | Sakshi
Sakshi News home page

అమానుషం: ఆటో డ్రైవర్‌పై మూత్ర విసర్జన 

Nov 13 2021 8:47 AM | Updated on Nov 13 2021 8:47 AM

Doctor Cruel Behaviour On Auto Driver In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, యలహంక(కర్ణాటక): ఆటో డ్రైవర్‌ను బాత్‌రూములోకి లాక్కెళ్లి మూత్ర విసర్జన చేసిన అమానుష ఘటన భాగళూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుడు రాకేశ్‌కు ఆటో డైవర్‌ మురళికి పరిచయం ఉంది. ఇటీవల ఓ క్లబ్‌లో వైద్యుడు, అతని స్నేహితులు మద్యం సేవించారు. అదే సమయంలో ఆటో డ్రైవర్‌ రావడంతో అతడిని కులం పేరుతో దూషించి మూత్ర విసర్జన చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుడిని అరెస్ట్‌ చేశారు.

టైర్‌ పేలి వాహనం పల్టీ 
శివమొగ్గ : కారు టైర్‌ పేలి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన శివమొగ్గ జిలా భద్రావతి పట్టణ సమీపంలోని వీరాపుర క్రాస్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడిని సుశాంత్‌ (35)గా గుర్తించారు. ఇతను కుటుంబ సభ్యులతో ఎర్టిగా కారులో వెళ్తుండగా టైర్‌ పేలడంతో వాహనం బోల్తా పడింది. సుశాంత్‌ మృతి చెందాడు. గాయపడిన వారిని భద్రావతి ఆస్పత్రికి తరలించారు.     

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement