
టెన్త్ విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన
* విద్యార్థినిని లాడ్జికి తీసుకొచ్చిన వైనం
* దాడిచేసి పట్టుకున్న పోలీసులు
సూర్యాపేట/ కూసుమంచి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యా ర్థినిని లాడ్జికి తీసుకొచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొం డపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన నెల్లూరి నాగేశ్వరరావు ఆరేళ్లుగా మండలంలోని నేలపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఇతను విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నేలపట్ల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(15)తో కొంతకాలంగా చనువు గా ఉంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సెలవుదినం కావడంతో సదరు విద్యార్థిని తన స్నేహితులతో కలసి కూసుమంచి శివాలయానికి వెళ్లింది. అక్కడి నుంచి ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి తన వెంట సూర్యాపేటకు తీసుకెళ్లాడు.
ఇక్కడి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లాడ్జిపై దాడులు నిర్వహించగా నిందితుడు పరారయ్యాడు. విద్యార్థినిని సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రి కి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. కాగా విద్యార్థిని తల్లి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పాఠశాల ఎదుట ధర్నా
కీచక ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును విధుల నుంచి తొలగించాలని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఖమ్మం జిల్లా నేలపట్ల గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం గ్రామంలోని ఆ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించారు. కీచక ఉపాధ్యాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు.