
నిందితుడు ప్రకాశ్
సాక్షి,బెంగళూరు : పాఠాలు చెబుతానంటూ విద్యార్థినిపై లెక్చరర్ తరచూ అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన జిల్లాలోని సాగర పట్టణంలో వెలుగు చూసింది. శివమొగ్గ పట్టణంలోని పీయూ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ప్రకాశ్ సాగర పట్టణంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తరచూ బస్సులో తనతో పాటు శివమొగ్గ పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థినితో పరిచయం పెంచుకున్న ప్రకాశ్ ఇంటికి వస్తే పాఠాలు చెబుతానంటూ నమ్మించాడు. పాఠాల కోసం ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న ప్రకాశ్ విద్యార్థినిపై గతకొద్ది కాలంగా తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం విద్యార్థిని అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు సాగర పోలీసులు ప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment