‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే హద్దురా) చిత్రంతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యలయాళ భామ అపర్ణా బాలమురళీ. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణా కథానాయికగా నటించింది. ఇందులో ఆమె తన అద్భుతన నటనకు గానూ ఆమెను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెతో ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తాజాగా మలయాళ భామ అపర్ణ విద్యార్థి తీరుపై స్పందించింది. ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని తెలిపింది. ఈ విషయంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అపర్ణ మాట్లాడుతూ.. 'తనను బలవంతంగా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరైంది కాదు. అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఈ సంఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం నాకు లేదు. అంత టైం కుడా లేదు. అయితే ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్పారని ఆమె వివరించారు. తన కొత్త మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కేరళలోని లా కాలేజీలో తన్కమ్ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ దర్శకుడు, హీరో వినీత్ శ్రీనివాసన్‌తో పాటు అపర్ణ కూడా పాల్గొంది.
క్షమాపణలు కోరిన విద్యార్థి సంఘం
అయితే ఈ సంఘటనపై ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థి సంఘం విచారం వ్యక్తం చేసింది. దీనిపై క్యాంపస్ యూనియన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో విద్యార్థి సంఘం ఓ నోట్ విడుదల చేసింది. లా కాలేజీలో నటిపై ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం అంటూ యూనియన్ తరపున విచారం వ్యక్తం చేశారు. అయితే యూనియన్ ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుందని.. సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment