Actress Devoleena Bhattacharjee Revealed About Shocking Incident With Her Teacher - Sakshi
Sakshi News home page

Devoleena Bhattacharjee: 'ఆ టీచర్‌ తప్పుగా ప్రవర్తించినా మా పేరెంట్స్‌ మాత్రం'..

Published Thu, Nov 25 2021 3:28 PM | Last Updated on Thu, Nov 25 2021 7:40 PM

Actress Devoleena Bhattacharjee Revealed About Shocking Incident In Her Childhood - Sakshi

Actress Devoleena Bhattacharjee Revealed About Shocking Incident In Her Childhood: ప్రముఖ హిందీ సీరియల్‌ నటి దేవొలీనా భట్టాచార్య.. చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తు చేసుకొని ఎమోషనల్‌ అయ్యింది. ఇటీవలె ఓ షోలో పాల్గొన్న ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ..'చిన్నప్పుడు ట్యూషన్‌కు వెళ్తే మ్యాథ్స్‌ టీచర్‌ తనతో చాలా తప్పుగా ప్రవర్తించాడని పేర్కొం‍ది. అతనికి చాలా మంచి టీచర్‌ అని గుర్తింపు ఉండేది. నా ఫ్రెండ్స్‌ సహా చాలా మంది పిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్‌కు వెళ్లేవారు.

అయితే వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్స్‌లో ఇద్దరు ట్యూషన్‌కు వెళ్లడం మానేశారు. ఏం జరిగింది అని అడిగినా చెప్పలేదు. ఆ తర్వాత ఓరోజు ఎప్పటిలాగానే నేను ట్యాషన్‌కు వెళ్లాను. అయితే అతను నాపై లైంగిక చర్యకు ప్రయత్నించాడు. వెంటనే ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అమ్మకి వివరించాను. ఆ తర్వాత ట్యూషన్‌ టీచర్‌ ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిందంతా చెప్పాం.

ఆ సమయంలో ఆ టీచర్‌పై పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్‌ ఇవ్వాలనిపించింది. కానీ ఇంట్లో వాళ్లు అలా చేయలేదు. దయచేసి మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు గమనిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వండి. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి. అంతే తప్పా చూసీ చూడకుండా వదిలేయకండి' అంటూ తల్లిదండ్రులకు విఙ్ఞప్తి చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement