అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు
Published Thu, Aug 4 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
గుంటూరు లీగల్: మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు నల్లబోయిన గోపికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ పీజే సుధ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గుంటూరు రూరల్ మండలం తోకవారిపాలెం గ్రామానికి చెందిన తెల్లమేకల వీరకుమారి పొలం పనులు చేస్తుంటుంది. సమీప మల్లవరం గ్రామానికి చెందిన నల్లబోయిన గోపికి వీరి పొలం వద్ద పొలాలు ఉన్నాయి. గోపీ తరచుగా వీరకుమారి ¿¶ ర్త గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆమె వెంట పడుతున్నాడు. ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు గోపీని మందలించారు. అయినా గోపి తన పద్ధతి మార్చు కోలేదు. 2014 సెప్టెంబర్ 21 మధ్యాహ్నం వీరకుమారి పొలంలో జొన్న గడ్డి కోస్తుండగా గోపీ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయండంతో చుట్టుపక్కల వారు రాగా పారిపోయాడు. జరిగిన సంఘటనపై వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు గోపిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితుడిపై నేరం రుజువు చేయడంతో అతనికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుధ తీర్పు చెప్పారు.
Advertisement
Advertisement