
కిర్రు చెప్పులతో పెద్దన్న
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): పెద్దల కాలంలో కిర్రు చెప్పులు రకరకాల రంగుల్లో తయారు చేయించి వేసుకొని వీధుల్లో తిరుగుతుంటే కిర్ కిర్ మంటూ వచ్చే శబ్దం అదో హోదాగా భావించేవారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, అమ్మవారి కొలుపులు, ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇలాంటి చెప్పులు వాడేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలు వాడే పాదరక్షల విషయంలో పెను మార్పులు చేటు చేసుకున్నాయి.
చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా..
కానీ నేటికి అలనాటి కిర్రు చెప్పులపై మోజు తీరని కొందరు పల్లెవాసులు వాటిని వాడుతుండటం విశేషం. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఎల్లమ్మ కొలుపుల వేడుకల్లో రెట్టపల్లి గ్రామానికి చెందిన నాలి పెద్దన్న కిర్రు చెప్పులతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. రూ.3 వేలు ఖర్చుపెట్టి చెప్పులు తయారు చేయించానని సాక్షితో ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment