
రంగు ‘చెప్పు’కోండి చూద్దాం!
ఈ తరం అమ్మాయిలు డ్రెస్‌కు మ్యాచింగ్ చెప్పులు లేనిదే బయట కాలు పెట్టరు. అలాంటి వారి కోసమే ఇషూ డిజైనర్స్ అనే సంస్థ రంగులు మారే పాదరక్షలను తయారు చేసింది. చెప్పు అడుగు భాగంలో ఉన్న బ్లూటూత్ రిసీవర్ ద్వారా చెప్పు కుడి, ఎడమ వైపున ఉన్న స్ట్రిప్‌పై రంగులు మారుతుంది.
ఈ ప్రక్రియను స్మార్ట్ ఫోన్ ద్వారా సంకేతాలు ఇవ్వడం వల్ల మనకు ఇష్టం వచ్చిన రంగులను సెలక్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్‌లో విడుదల కానున్న వీటి ధర రూ. 15,600.