
పాదరక్షల భారీ క్యూ
జమ్మికుంట(కరీంనగర్): నోట్ల కష్టాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కేడీసీసీ బ్యాంకు వద్ద గురువారం వేకువజాము నుంచే ఖాతాదారులు భారీగా చేరుకొని క్యూలో నిల్చున్నారు. బ్యాంకు తెరిచేలోగా కాసేపు నీడన విశ్రాంతి తీసుకోవాలనుకున్న ఖాతాదారులు క్యూలో నిల్చోవడానికి బదులు చెప్పులను పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ నీడన చేరడంతో భారీగా చెప్పుల క్యూ ఏర్పడింది.