భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment