Ranbir Kapoor Pickup Alia Bhatt Slippers, Netizens Fires - Sakshi
Sakshi News home page

భార్య చెప్పులు మోసిన రణ్‌బీర్‌..నెటిజన్స్‌ ఫైర్‌, అసలు కారణం ఇదే..

Published Sat, Apr 22 2023 3:35 PM | Last Updated on Sat, Apr 22 2023 6:07 PM

Ranbir Kapoor Pickup Alia Bhatt Slippers, Netizens Fires - Sakshi

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌లో రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంట ఒకటి. ఈ జంట ఏ పని చేసినా అది క్షణాల్లో వైరల్‌ అవుతుంది. అయితే సోషల్‌ మీడియాలో వచ్చే రూమర్స్‌ని, కామెంట్స్‌ని పట్టించుకోకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. సినిమాల వరకే స్టార్స్‌లా ప్రవర్తిస్తారు కానీ.. నిజ జీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు. తాజాగా ఈ జంట, ముఖ్యంగా రణ్‌బీర్‌ ట్రోల్స్‌కి గురవుతున్నారు. దానికి కారణంగా రణబీర్‌.. అలియా చెప్పులను మోయడమే. భార్య చెప్పులను భర్త మోస్తే తప్పేంటని అనుకుంటున్నారా?... అయితే పూర్తి కథనం చదవండి.

గత గురువారం (ఏప్రిల్‌ 21) ఫిల్మ్‌ మేకర్‌ ఆదిత్య చోప్రా తల్లి  పమేలా చోప్రా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే బాలీవుడ్‌ ప్రముఖులంతా ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఇక రణ్‌బీర్‌, అలియాభట్‌ జంట కూడా కాస్త ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే క్రమంలో అలియా తన చెప్పులను గుమ్మం ముందు విడిచి వెళ్లింది. వెనకే వచ్చిన రణ్‌బీర్‌ ఆ చెప్పులను చేతులతో పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టాడు.

(చదవండి: నగ్న వీడియో షేర్‌ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్‌ ఫైర్‌)

 ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ట్రోలింగ్‌కు కారణం ఏంటంటే.. రణ్‌బీర్‌ ఆ చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు పెట్టడమే. భార్య చెప్పులు మోయడం తప్పుకాదు.. కానీ వాటిని గుడిముందు పెట్టడం ఏంటి? అలియా ఆలోచించే ఆ చెప్పులను మెట్ల ముందు వదిలింది. కానీ రణ్‌బీర్‌ మాత్రం తెలివితక్కువ పని చేశాడు. పైగా అతను చెప్పులతో లోపలికి వెళ్లాడు’ అని నెటిజన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement