
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతానానికి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ యువకుడిపై అమానుషంగా దాడి చేశారు. ఈ దారణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాహరాన్‌పూర్‌లో ఇనుపా రాండ్లు దొంగలించాడన్న అనుమానంతో ఓ యువకుడిని స్థంబానికి కట్టేసి కొంత మంది దాడి చేశారు.
Warning: Disturbing video
— Piyush Rai (@Benarasiyaa) December 6, 2023
In UP's Saharanpur, a man suspected of theft was tied to a pole and brutally flogged using a stick by accused identified as Amit Sharma. pic.twitter.com/NXSJIVLO70
అందులో ఓ వ్యక్తి అమానవీయంగా కర్రతో విచక్షణ రహితంగా యువకుడిని చితకబాదాడు. విషయం తెలుసుకున్న సాదర్ బజార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిపై దాడి చేసిన ఏడుగురు వ్యక్తును అదుపులోకి తీసుకొని.. పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాధిత యువకుడిని స్థానికంగా ఉండే అమిత్ శర్మగా పోలీసులు గుర్తించారు.