పాట్నా: బిహార్‌లో నడిరోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విపక్ష బీజేపీ మండిపడింది. బిహార్‌లో నేరస్థులను వదిలేసి సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు వివరణ కూడా ఇచ్చారు.
సితామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసులో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో రక్షించిన బాలిక కోసం ఇద్దరు మహిళలు పోటీ పడ్డారు. తమ బాలికేనని ఇరువురు గొడవకు దిగారు. పోలీసులు విడిపించినా గొడవ ఆపలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తప్పుబడుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు
Comments
Please login to add a commentAdd a comment