![Man Thrashed On Suspicion Of Mobile Theft - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/9/Mobile-Theft.jpg.webp?itok=6mC805sY)
హరిద్వార్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొందరు తలకిందులుగా చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగుచూసింది. చెట్టుకు తలకిందులుగా వ్యక్తిని వేలాడదీసిన ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా గత వారంలోనూ మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణలపై ఓ టీనేజర్‌ను దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన బాధితుడు మరణించిన సంగతి తెలిసిందే. స్ధానికులు అతడిని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకువచ్చి మూక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తమ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారని, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆ తర్వాత కేసు నమోదు చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment