వడోదర : 16 ఏళ్ల గిరిజన యువతి ప్రియుడితో పారిపోయి తమ పరువు తీసిందన్న కారణంతో ఆమెను తన కన్నతండ్రి ఎదుటే విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లా బిల్వంత్ గ్రామంలో మే 21న చోటుచేసుకుంది. వివరాలు.. బిల్వంత్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన యువతి అదే ఊరికి చెందిన ఒక యువకుడితో మధ్యప్రదేశ్‌లోని తన బంధువుల ఇంటికి పారిపోయింది. అనంతరం కొద్ది రోజులకు తిరిగివచ్చిన యువతిని ఆ ఊరి గ్రామస్తులు ఊరి బయటే అడ్డుకున్నారు. తక్కువ కులంలో పుట్టడమే గాక యువకుడితో పారిపోయి కులం పరువు తీశావంటూ తాడుతో కట్టేసి ముగ్గురు గ్రామస్తులు ఆమెను విచక్షణారహితంగా చితకబాదారు. ఒకరు చితకబాదుతుంటే మరొకరు వీడియో తీశారు. మొదట ఆ యువతిని ఇద్దరు పట్టుకోగా మరొకరు కట్టెతో యువతి శరీరంపై విచక్షణారహితంగా కొట్టాడు. తర్వాత యువతిని కింద పడేసి కాలి బూట్లతో ముఖం మీద, వీపు మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ దాడికి పాల్పడ్డారు.
(ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..)
ఈ ఘటన జరుగుతున్నంతసేపు అక్కడే ఉన్న తండ్రి తన కూతురిని చావగొడుతున్నా ఏం చేయలేక చూస్తు ఉండిపోయాడు. కాగా మే21 న ఈ ఘటన జరిగినా యువతిని చావగొట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు యువతి తండ్రితో రంగాపూర్ పోలీస్ స్టేషన్‌లొ అధికారిక ఫిర్యాదును నమోదు చేయించారు. యువతిని చితకబాదిన వారిలో దేశింగ్ రత్వా, భిప్ల ధనుక్, ఉడేలియా ధనుక్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై మైనర్‌పై విచక్షణరహిత దాడికి పాల్పడినందుకు ఫోక్సో చట్టంతో పాటు మరో 16 క్రిమినల్ కేసులు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు యువతిని చితకబాదుతున్న సమయంలో ప్రేక్షకపాత్ర వహించిన 13 మందిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పూర్తి వీడియో కోసం
Comments
Please login to add a commentAdd a comment