Eloping
-
ఆ బాలికపై దాడి అమానుషం : రాహుల్
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక ప్రియుడితో పారిపోయిందని ఆ ఊరి గ్రామస్తులు ఆమైపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియేపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ హింస బహిరంగంగా జరుగుతోందని, భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఇది సూచిస్తోందని అన్నారు. మహిళలను ఉన్నత స్థాయిలో చూపే సంప్రదాయం ఉన్న చోటే వారికి గౌరవం లేకపోవడం, విలువ లేని వారిగా చిత్రీకరించడం జరగుతోందని అన్నారు. (ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు) ఈ ఘటన గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లా బిల్వంత్ గ్రామంలో మే 21న చోటుచేసుకుంది. వివరాలు.. బిల్వంత్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన బాలిక అదే ఊరికి చెందిన ఒక యువకుడితో మధ్యప్రదేశ్‌లోని తన బంధువుల ఇంటికి పారిపోయింది. అనంతరం కొద్ది రోజులకు తిరిగివచ్చిన ఆమెను ఆ ఊరి గ్రామస్తులు ఊరి బయటే అడ్డుకున్నారు. తక్కువ కులంలో పుట్టడమే గాక యువకుడితో పారిపోయి కులం పరువు తీశావంటూ తాడుతో కట్టేసి ముగ్గురు గ్రామస్తులు ఆమెను విచక్షణారహితంగా చితకబాదారు. బాలికను బెత్తాలతో కొడుతుండగా చుట్టూ ఉన్న వారు చోద్యం చూస్తుండగా, దెబ్బలకు తాళలేక బాలిక కిందపడిపోయినప్పటికీ కొట్టడం కనిపించింది. పూర్తి వీడియో కోసం -
ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు
వడోదర : 16 ఏళ్ల గిరిజన యువతి ప్రియుడితో పారిపోయి తమ పరువు తీసిందన్న కారణంతో ఆమెను తన కన్నతండ్రి ఎదుటే విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లా బిల్వంత్ గ్రామంలో మే 21న చోటుచేసుకుంది. వివరాలు.. బిల్వంత్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన యువతి అదే ఊరికి చెందిన ఒక యువకుడితో మధ్యప్రదేశ్‌లోని తన బంధువుల ఇంటికి పారిపోయింది. అనంతరం కొద్ది రోజులకు తిరిగివచ్చిన యువతిని ఆ ఊరి గ్రామస్తులు ఊరి బయటే అడ్డుకున్నారు. తక్కువ కులంలో పుట్టడమే గాక యువకుడితో పారిపోయి కులం పరువు తీశావంటూ తాడుతో కట్టేసి ముగ్గురు గ్రామస్తులు ఆమెను విచక్షణారహితంగా చితకబాదారు. ఒకరు చితకబాదుతుంటే మరొకరు వీడియో తీశారు. మొదట ఆ యువతిని ఇద్దరు పట్టుకోగా మరొకరు కట్టెతో యువతి శరీరంపై విచక్షణారహితంగా కొట్టాడు. తర్వాత యువతిని కింద పడేసి కాలి బూట్లతో ముఖం మీద, వీపు మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ దాడికి పాల్పడ్డారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..) ఈ ఘటన జరుగుతున్నంతసేపు అక్కడే ఉన్న తండ్రి తన కూతురిని చావగొడుతున్నా ఏం చేయలేక చూస్తు ఉండిపోయాడు. కాగా మే21 న ఈ ఘటన జరిగినా యువతిని చావగొట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు యువతి తండ్రితో రంగాపూర్ పోలీస్ స్టేషన్లొ అధికారిక ఫిర్యాదును నమోదు చేయించారు. యువతిని చితకబాదిన వారిలో దేశింగ్ రత్వా, భిప్ల ధనుక్, ఉడేలియా ధనుక్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై మైనర్‌పై విచక్షణరహిత దాడికి పాల్పడినందుకు ఫోక్సో చట్టంతో పాటు మరో 16 క్రిమినల్ కేసులు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు యువతిని చితకబాదుతున్న సమయంలో ప్రేక్షకపాత్ర వహించిన 13 మందిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వీడియో కోసం -
లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు!
తమ ఇంటి అమ్మాయిని లేవదీసుకుపోయాడని.. ఓ టీచర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలిహాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ (32) అనే ఈ టీచర్ తన తల్లిదండ్రులతో కలిసి గడాహో గ్రామంలో ఉండేవాడు. ఓ అమ్మాయితో బాగా చనువుగా ఉంటూ.. ఆమెతో కలిసి సోమవారం ఎటో వెళ్లిపోయాడు. అతడి ఆచూకీని ఎలాగోలా కనిపెట్టిన అమ్మాయి తండ్రి రాజారామ్, సోదరులు అనిల్, మునిష్ కలిసి పట్టుకుని.. కొట్టి కొట్టి చంపేశారు. ఆ ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లు ముగ్గురు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
విద్యార్థితో పారిపోయింది! టీచర్‌పై రేప్ కేసు!!
తిరున్వేలి: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలే దారితప్పింది. తన కన్నా వయస్సులో చిన్నవాడైన 15 ఏళ్ల బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఏడాది పాటు అతనితో గడిపి.. చివరకు గర్భవతి అయింది. దీంతో ఆ 23 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడి జరిపినట్టు అభియోగాలు మోపారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని కడయనల్లూరు గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్లో 23 ఏళ్ల యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పీజీ చదివిన ఆమె తన విద్యార్థి అయిన 15 ఏళ్ల బాలుడితో ఏడాది కిందట ఇంటి నుంచి పారిపోయింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆ బాలుడు 60 తులాల బంగారం, రూ. 10వేలు ఎత్తుకుపోయాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిగా రహస్యంగా గడుపుతున్న ఇద్దరిని పోలీసులు తాజాగా తిరుపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు మిల్లు వద్ద గుర్తించారు. ఇద్దరు కూడా మిల్లులో పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఓ ప్రైవేటు టెలిఫోన్ కేంద్రం నుంచి వారు స్నేహితులకు, సన్నిహితులకు ఫోన్ చేస్తుండటంతో ఈ నంబర్ ద్వారా పోలీసులు వాళ్ల ఆచూకీని కనిపెట్టారు. గర్భవతి అయిన టీచర్‌ను అరెస్టు చేసి మేజిస్ట్రేటు ముందు హాజరు పరుచగా.. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రేప్, కిడ్నాప్ తోపాటు బాలలపై లైంగిక నేరాల వ్యతిరేక చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. -
ప్రేమపెళ్లి కోసం వెళ్తే.. రాళ్లతో కొట్టి చంపారు
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మనసుకు నచ్చని పెళ్లిని వ్యతిరేకించిన ముస్లిం యువతిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఫ్ఘాన్ మీడియా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయడంతో ఈ అమానుషం వెలుగు చూసింది. అఫ్ఘానిస్తాన్‌లోని రాక్ సహానా అనే ముస్లిం యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి పారిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నించింది. అదే ఆమె చేసిన నేరం. తాలిబన్లు ఆమెపై తమ ప్రతాపాన్ని చూపించారు. ప్రియుడితో కలిసి వెళుతుండగా పట్టుకుని అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ మొత్తం వైనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు మీడియాలో బయటపడింది. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 20 ఏళ్ల వయసున్న రాక్ సహానా హృదయ విదారక రోదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడున్నవాళ్లంతా ఈ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేదు. ఆమెపై రాళ్లు విసురుతున్న శబ్దం, షహాదా అంటూ ఆమె పెట్టిన ఆర్తనాదాలు క్రమేపీ సన్నగిల్లడం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది. ఆ అమానుషం గతవారం ఘర్ రాష్ట్రంలోచోటుచేసుకుందని స్థానిక మహిళా గవర్నర్ సీమ జోయేంద్ర తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నా, ఘర్ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మతపెద్దలు, ఇతర సాయుధుల సమక్షంలో ఆ యువతిని రాళ్లతో కొట్టి చంపారని ఆమె తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.