![Rahul Gandhi Reacts About Minor Tribal Girl Brutally Thrashed Eloping In Gujarat - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/31/Rahul.jpg.webp?itok=s3cb3Ez4)
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక ప్రియుడితో పారిపోయిందని ఆ ఊరి గ్రామస్తులు ఆమైపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియేపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ హింస బహిరంగంగా జరుగుతోందని, భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఇది సూచిస్తోందని అన్నారు. మహిళలను ఉన్నత స్థాయిలో చూపే సంప్రదాయం ఉన్న చోటే వారికి గౌరవం లేకపోవడం, విలువ లేని వారిగా చిత్రీకరించడం జరగుతోందని అన్నారు. (ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు)
ఈ ఘటన గుజరాత్‌లోని చోటా ఉదేపూర్ జిల్లా బిల్వంత్ గ్రామంలో మే 21న చోటుచేసుకుంది. వివరాలు.. బిల్వంత్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల గిరిజన బాలిక అదే ఊరికి చెందిన ఒక యువకుడితో మధ్యప్రదేశ్‌లోని తన బంధువుల ఇంటికి పారిపోయింది. అనంతరం కొద్ది రోజులకు తిరిగివచ్చిన ఆమెను ఆ ఊరి గ్రామస్తులు ఊరి బయటే అడ్డుకున్నారు. తక్కువ కులంలో పుట్టడమే గాక యువకుడితో పారిపోయి కులం పరువు తీశావంటూ తాడుతో కట్టేసి ముగ్గురు గ్రామస్తులు ఆమెను విచక్షణారహితంగా చితకబాదారు. బాలికను బెత్తాలతో కొడుతుండగా చుట్టూ ఉన్న వారు చోద్యం చూస్తుండగా, దెబ్బలకు తాళలేక బాలిక కిందపడిపోయినప్పటికీ కొట్టడం కనిపించింది.
పూర్తి వీడియో కోసం
Comments
Please login to add a commentAdd a comment