లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు! | Teacher killed for eloping with woman | Sakshi
Sakshi News home page

లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు!

Published Wed, Apr 20 2016 1:00 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు!

లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు!

తమ ఇంటి అమ్మాయిని లేవదీసుకుపోయాడని.. ఓ టీచర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలిహాబాద్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ (32) అనే ఈ టీచర్ తన తల్లిదండ్రులతో కలిసి గడాహో గ్రామంలో ఉండేవాడు. ఓ అమ్మాయితో బాగా చనువుగా ఉంటూ.. ఆమెతో కలిసి సోమవారం ఎటో వెళ్లిపోయాడు.

అతడి ఆచూకీని ఎలాగోలా కనిపెట్టిన అమ్మాయి తండ్రి రాజారామ్, సోదరులు అనిల్, మునిష్ కలిసి పట్టుకుని.. కొట్టి కొట్టి చంపేశారు. ఆ ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లు ముగ్గురు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement