తనకు రావాల్సిన జీతం అడిగిందనే అక్కసుతో ఒక యువతిని దారుణంగా హింసించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిస్సహాయురాలైన యువతిపై కొంతమంది యువకులు సామూహింగా దాడికి దిగి అమానుషంగా ప్రవర్తించారు. జుట్టు పట్టి లాగి, కర్రలతో దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా పరిధిలోని కమర్షియల్ ఏరియాలో నడిరోడ్డుపై ఈ ఉదంతం చోటు చేసుకుంది.