ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి | 11 year old girl beaten by cop for riding his bicycle, dies of burns | Sakshi
Sakshi News home page

ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి

Published Sat, Jan 31 2015 9:50 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి - Sakshi

ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి

ఇండోర్: అనుమతి లేకుండా తన సైకిల్ తొక్కిందని ఏఎస్‌ఐ వేధించడంతో ఆత్మాహుతికి యత్నించిన పదకొండేళ్ల బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. రెండు రోజుల పాటు మత్యువుతో పోరాడిన బాలిక చివరకు తనువు చాలించింది. ఈ ఘటన ఇండోర్‌లో జరిగింది. గతనెల 29న స్థానిక సికింద్రాబాద్ కాలనీలో ఉంటున్న ఏఎస్‌ఐ ప్రకాష్ జరోలియాకు చెందిన సైకిల్‌ను యాస్మిన్ నడిపింది. తన అనుమతి లేకుండా యాస్మిన్ సైకిల్ నడపడంతో కోపోద్రిక్తుడైన జరోలియా ఆ బాలికను కొట్టడంతోపాటు, బాలిక, ఆమె తల్లిదండ్రులపై సైకిల్ దొంగతనం కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తానని బెదిరించాడు.

 

ఈ బెదిరింపులతో భయపడ్డ యాస్మిన్ తన ఇంటిలో ఆత్మాహుతికి యత్నించింది. వంద శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement