విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీ నాగరాజు
నిజామాబాద్ అర్బన్: తరచూ దొంగతనాలకు పాల్పడుతూ, డబ్బుల కోసం కుటుంబ సభ్యులను కూడా వేధిస్తుండడంతో కొడుకును కన్న తండ్రే హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హమాల్‌వాడీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు కమిషనర్ నాగరాజు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే రవికి ఇద్దరు కుమారులు.. చిన్న వాడైన ఉపేంద్ర (21) తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఇంట్లో కూడా డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉపేంద్ర తన తల్లిని డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే చంపేస్తానని మెడపై బ్లేడ్ పెట్టి బెదిరించాడు. తర్వాత తల్లివద్ద నుంచి రూ.100 తీసుకుని వెళ్లాడు. దీనిపై రాత్రి ఇంటికి వచ్చిన ఉపేంద్రను తండ్రి నిలదీయడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో రవి ఇనుప రాడ్‌తో చితక బాధగా ఉపేంద్ర చనిపోయాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఉపేంద్ర మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వదిలేసి వెళ్లిపోయాడు.
ఆస్పత్రి వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మృతదేహాన్ని గమనించి మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉపేంద్ర మృతదేహాన్ని పరిశీలించి జేబు దొంగతనాలు చేసే పాతనేరస్తుడిగా గుర్తించారు. కు టుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బుధవారం పోలీసులు జరిపిన విచారణలో కొడుకు ఉపేంద్రను తనే చంపినట్లు రవి తెలిపాడు. ఉపేంద్ర తరచుగా దొంగతనాలు చేస్తున్నాడని, తన భార్యను చంపే ప్రయత్నం చేశాడని, అందుకే హతమార్చానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment