Nagraj
-
వేధింపులు భరించలేక..
నిజామాబాద్ అర్బన్: తరచూ దొంగతనాలకు పాల్పడుతూ, డబ్బుల కోసం కుటుంబ సభ్యులను కూడా వేధిస్తుండడంతో కొడుకును కన్న తండ్రే హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హమాల్వాడీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు కమిషనర్ నాగరాజు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే రవికి ఇద్దరు కుమారులు.. చిన్న వాడైన ఉపేంద్ర (21) తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇంట్లో కూడా డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉపేంద్ర తన తల్లిని డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే చంపేస్తానని మెడపై బ్లేడ్ పెట్టి బెదిరించాడు. తర్వాత తల్లివద్ద నుంచి రూ.100 తీసుకుని వెళ్లాడు. దీనిపై రాత్రి ఇంటికి వచ్చిన ఉపేంద్రను తండ్రి నిలదీయడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో రవి ఇనుప రాడ్‌తో చితక బాధగా ఉపేంద్ర చనిపోయాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఉపేంద్ర మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వదిలేసి వెళ్లిపోయాడు. ఆస్పత్రి వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మృతదేహాన్ని గమనించి మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉపేంద్ర మృతదేహాన్ని పరిశీలించి జేబు దొంగతనాలు చేసే పాతనేరస్తుడిగా గుర్తించారు. కు టుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బుధవారం పోలీసులు జరిపిన విచారణలో కొడుకు ఉపేంద్రను తనే చంపినట్లు రవి తెలిపాడు. ఉపేంద్ర తరచుగా దొంగతనాలు చేస్తున్నాడని, తన భార్యను చంపే ప్రయత్నం చేశాడని, అందుకే హతమార్చానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. -
గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి: కేఎన్వీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవడంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు మాత్రమే కరోనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. -
నిరుపేద గూటిలో పరుగుల ధీరుడు
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె తాలూకాలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈ.నాగరాజ్ అనే యువకుడు పేద కుటుంబంలో జన్మించినా ఆటల్లో మేటి. పరుగు పందెంలో రాణించి తాలూకాకు, జిల్లాకు, రాష్ట్రానికే పేరుప్రతిష్టలు సంపాదించాడు. నాగరాజ్ కుటుంబానికి చిన్న పూరి గుడిసే ఆధారం. చిన్న వయస్సు నుంచి పేదరికాన్ని అధిగమించి క్రీడా రంగంలో ఆసక్తి పెంచుకున్నాడు. నేపాల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని అందుకుని గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నింపాడు. అతడు ఇప్పుడు నేపాల్‌లో ఆటలపోటీల్లో ఉన్నాడు. చినిగిన చెప్పులతో ఎయిర్‌పోర్టుకు నేపాల్‌కు వెళ్లడానికి చిత్రదుర్గం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చినిగి పోయిన చెప్పులతోనే నాగరాజు వెళ్లాడు. దీనిని గమనించిన తమ గ్రామానికి చెందిన న్యాయవాది అశోక్ నాగరాజ్‌కు షూ ఇప్పించాడు. గతనెల 26న నేపాల్ వెళ్లి రావడానికి స్నేహితులు, ఇతరులు రూ.2 వేలు ధనసహాయం చేశారు. అక్కడ గత నెల 29వ తేదీన జరిగిన అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 24 దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించాడు. పేద విద్యార్థి సాధనను తెలుసుకున్న నేపాల్ సైన్యం కూడా అభినందనలు తెలిపింది. చిత్రదుర్గ ప్రభుత్వం కళాశాలలో బీఏ చదువుకున్న నాగరాజు బీసీఎం హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుంటూ కూలి పని తాలూకాలోని ఓబళాపుర గ్రామ పంచాయితీలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈరణ్ణ, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగరాజ్. గతంలో గోవాలో జరిగిన రాష్ట్రస్థాయి నాలుగవ అఖిల భారత చాంపియన్ షిప్లో పాల్గొని 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో బంగారు పతకం కొట్టేశాడు. నాగరాజ్ తన చదువులు, ఖర్చుల కోసం తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడక, శని, ఆదివారాలలో కళ్యాణ మంటపాల్లో జరిగే వేడుకల్లో భోజనాలు వడ్డించే పని చేస్తాడు. ఆ డబ్బులో కొంత తల్లిదండ్రులకూ పంపుతాడు. మంగళవారం నేపాల్ నుంచి బెంగళూరులో దిగి, అటు నుంచి చెళ్లకెరెకు వస్తున్న నాగరాజ్‌కు స్థానిక ఎమ్మెల్యే టి.రఘుమూర్తి స్వాగతం పలికి సన్మానిస్తానని తెలిపారు. -
మేకప్ పైకన్నీటిచారలు
♦ అర్ధాకలితో అలమటిస్తున్న మేకప్ కళాకారులు ♦ ఉత్సవాల్లో వేషధారులకు రంగులద్ది జీవనం పెరవలి : ఉత్సవాలలో వేషధారులకు మేకప్ వేసి జీవించే కళాకారుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి.ఏడాదిలో 15 రోజులు మాత్రమే వీరికి పని ఉంటోంది. మిగిలిన రోజుల్లో రోడ్లపై కేకులు అమ్ముకుంటూపొట్ట నింపుకుంటారు. కడుపునిండకపోయినా కళపై అభిమానంతో ఇంకా మేకప్‌నే నమ్ముకుని జీవిస్తున్నామని రాజమండ్రికి చెందిన నాగరాజు డ్రామా డ్రెసెస్ కంపెనీ కళాకారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా.. ఈ మేకప్మెన్లు ఉత్సవాల్లో వేసే పౌరాణిక వేషాల దగ్గర నుంచి నాటకాలు, నాటికలకు వేసే వేషాల వరకు అవలీలగా మేకప్ వేస్తారు. ఆడవారిని మగవారిగా మగవారిని ఆడవారుగా మార్చి వేయటంలో అందెవేసిన చేతులు వీరివి. ఉత్సవాల్లో కేవలం మూడు గంటల్లో 30 వేషాలకు మేకప్ వేయగలరు. రాముడు, కృష్ణుడు, ధుర్యోదనుడు, లవకుశ, ఆంజనేయలు, దుర్గామాత వంటి 50 నుంచి 100 వేషాల వరకు వీరు తీర్చి దిద్దగలరు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉత్సవాల్లో వచ్చే ప్రోగ్రాంలు బట్టి వేషాలకు మేకప్‌లు వేస్తామని చెప్పారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తణుకు, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు పలు పల్లెల్లో తాము వేషధారులకు మేకప్‌లు వేసి మెప్పించినట్టు తెలిపారు. -
అత్తగారి ఇంటి ఎదుట మహిళ ఆందోళన
♦ న్యాయం చేయాలని డిమాండ్ ♦ మద్దతు తెలిపిన మహిళా సంఘాలు నేరేడుచర్ల (హుజూర్నగర్) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత తన అత్తగారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ స సంఘటన మంగళవారం మండలంలోని కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఆందోళనకు సూర్యాపేటకు చెందిన మహిళా సంఘాలు మద్దతు పలికారు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అరుణకు నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బుడిగె నాగరాజుతో 1998లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. పెళ్లయిన కొద్దికాలం వరకు మంచిగానే సాగిన వీరి సంసారంలో విబేధాలు రావడంతో భార్యభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. 2008లో అదనపు కట్నం కోసం వేధిం చాడని నాగరాజుపై అరుణ కేసు పెట్టి కోర్టును ఆశ్రయిం చింది. ఆనాటి నుంచి అరుణ పుట్టింట్లోనే ఉంటోంది. నాగరాజు పిల్లలిద్దరిని చదివించుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ నేపథ్యంలో అరుణ మంగళవారం తనను ఆదరిచాలని తన పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి ఇంటి ఎ దుట బైఠాయించింది. ఈమె ఆందోళనకు మహిళా సం ఘా ల మద్దతు తెలిపాయి. ఆందోళన జరుగుతున్న సమయంలో తన భర్త అందుబాటులో లేడు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆం దోళన చేస్తున్న మహిళలను స్టేషన్‌కు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలని సూచించడంతో స్టేషన్‌కు తరలివెళ్లారు. -
మానవత్వానికే మచ్చ
చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తి వస్తువులు దోపిడీ {పమాదానికి కారణమైన వారినీ తప్పించిన వైనం ఆధారాలు లేక గుర్తించలేని పోలీసులు పత్రికల్లో వార్త చూసి గుర్తించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ క్రైం తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని పట్టించుకోని లోకమిది..! చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తినీ దోచుకొనే ‘నేరగాళ్ల’ రాజ్యమిది..!! ప్రమాదాలు చేసి, ప్రాణాలను తీసే వారిని క్షేమంగా పంపించే వైనమిది.. మానవత్వపు ఆనవాళ్లు మాయమైపోతున్నాయనేందుకు నగరంలో బుధవారం జరిగిన ఘటనే నిదర్శనం. అసలేం జరిగిందంటే.. నగరంలోని ఇంద్రాపూర్‌కు చెందిన గోరేవార్ రాజేశ్వర్ అలియాస్ నాగరాజు (35)కు భార్య లక్ష్మి, పదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్కూల్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న రాజేశ్వర్.. సాయంత్రం వేళలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి ఆటోలో పూలాంగ్ చౌరస్తా వైపు వెళ్తుండగా, హోటల్ వంశీ వద్దకు రాగానే డీజిల్ అయిపోయింది. డీజిల్ కోసమని ఎదురుగా గల పెట్రోల్‌బంక్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఆయనను పూలాంగ్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. అక్కడే ఉన్న వారు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి.. బైక్‌పై ఉన్న జంటను అక్కడి నుంచి పంపేశారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రాజేశ్వర్‌ను ఆస్పత్రికి తరలించాల్సింది పోయి.. అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సును కొట్టేశారు. చివరకు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో రాజేశ్వర్ తుదిశ్వాస విడిచాడు. ఫోన్, పర్సు కొట్టేయడంతో మృతుడ్ని గుర్తించేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి, గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, రాజేశ్వర్ మృతి వార్త ఫొటోతో సహా పత్రికల్లో రావడంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తూ గురువారం పోలీసులను ఆశ్రయించారు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి భార్య కుప్పకూలిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
చనిపోయిన వ్యక్తికి వైద్యం..
⇒చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుని బంధువుల ఆందోళన ⇒రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించి మోసం చేశారని మండిపాటు ⇒వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చీరాలలో ‘ఠాగూర్’ తరహా మోసం ఠాగూర్ చిత్రంలో ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఓ ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి మృతుని బంధువుల నుంచి వైద్యులు రూ.లక్షలు దండుకుంటారు. విషయాన్ని కథానాయకుడు గ్రహించి వైద్యుల గుట్టురట్టు చేస్తాడు. చీరాలలో అచ్చం అలాగే జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందించారు. బంధువులతో రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరకు గుంటూరు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆటో డ్రైవర్‌ను పరిశీలించిన వైద్యులు.. ఇతడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులైందని చెప్పడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరొక్కసారి అందరూ ఠాగూర్ చిత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చీరాల : వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన గవిని నాగరాజు (30) పురుగుమందు తాగి గత నెల 20న ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అప్పులు పాలవడంతో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో పురుగుముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నాగరాజును చీరాలలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. 15 రోజులు పాటు చికిత్స అందించారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. గురువారం సాయంత్రం 3గంటల సమయంలో నాగరాజుకు సీరియస్‌గా ఉందని, గుంటూరు తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. నాగరాజు చనిపోయి రెండు రోజులైందని వైద్యులు ధ్రువీకరించడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుని బంధువులు, గ్రామస్తులు పోస్టుమార్టం అనంతరం చీరాల వచ్చి గడియారస్తంభం వద్ద ధర్నా చేశారు. వైద్యశాల అద్దాలు పగలగొట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. 15 రోజులు పాటు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరకు ప్రాణాలు పోగొట్టారని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను నియంత్రించారు. ఈ సంఘటనపై వైద్యశాల డాక్టర్లు మాత్రం తమ తప్పు ఏమీలేదని, సక్రమంగా వైద్యం చేశామని, అవసరమైతే కేసు పెట్టుకోవాలని ఉచిత సలహా కూడా ఇవ్వడం గమనార్హం. విచారణ జరిపించండి : ఎమ్మెల్యే ఆమంచి నాగరాజు మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. ఆటో డ్రైవర్ మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని, వైద్యశాలను సీజ్ చేయాలని కోరారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాగరాజు మృతదేహాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పోతుల సునీత పరిశీలించారు. మృతుని బంధువులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామన్నారు. -
వివాహితపై సామూహిక అత్యాచారం
తాడిపత్రి/ పెద్దవడుగూరు, న్యూస్‌లైన్ : పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరించి అందరికీ పంపించడమే కాకుండా ఇంటర్నెట్లోనూ పెట్టారు. పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారంఅమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు... ఓ వివాహిత వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన సమయంలో ముగ్గురు యువకులు ఆమెపై దాడిచేశారు. చెట్లపొదల్లోకి బలవంతంగా తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటనను ఒకరు తన సెల్ఫోన్లో వీడియో తీసుకున్నాడు. ‘బయటకు చెబితే నీ పరువు పోతుంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతాం’’ అని బెదిరించి వదిలేశారు. కొద్దిరోజు తర్వాత సెల్ఫోన్లో తీసిన యువకుడు మరొకరికి ఆ వీడియోను పంపాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరి సెల్ఫోన్లోకి పంపించుకున్నారు. ఆఖరికి ఇంటర్నెట్లోనూ ఈ దృశ్యాన్ని పెట్టారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని భయపడి ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తనే కుమిలిపోయింది. సెల్ఫోన్లో వీడియోను చూసిన వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో ఆమె భర్త సోమవారం పెద్దవడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై అత్యాచారం చేసిన నిందితులు నాగేష్, నాగరాజు, బాలుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. వీడియో ఆధారంగా గుర్తించిన నిందితులలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పారు. -
అభయ కేసులో రేపే తీర్పు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కేవలం 209 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తైతీర్పు రానుండటంతో పోలీసుల పనితీరుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. నిందితులకు శిక్షలు పడేలా అత్యంత కీలకంగా భావించే 21 మంది సాక్షులను మాదాపూర్ పోలీసులు ఈ కేసులో చేర్చారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఇన్నార్బిట్మాల్, బిర్లా మైండ్‌స్పేస్ స్కూల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు బాధితురాలికి బాసటగా నిలిచాయి. ఈ కేసులో రాష్ట్రంలోనే తొలిసారిగా అమెరికాలో ఉన్న సాక్షిని జడ్జి నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం గమనార్హం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బాధితురాలికి అనుకూలంగానే సాక్ష్యాలు ఉన్నాయాని, నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తీర్పును స్వయంగా వినేందుకు సైబ రాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఎల్బీనగర్ కోర్టుకు హాజరుకానున్నారు. ఆరోజు ఏమైంది... బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది. డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది. పునరావృత్తం కాకుండా... ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా ఉండేందుకు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఐదంచెల భద్రతా వ్యవస్థను రూ.6 కోట్ల వ్యయంతో రూపొందించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ పోలిసింగ్ వ్యవస్థను రూపొందించారు. ఫలితంగా నేటి వరకు అభయ ఘటన వంటిది జరగలేదు. కాగా, ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తును పక్కా ప్రణాళికతో త్వరగా పూర్తి చేయించారు. -
విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర
రామకుప్పంలో రెస్కో కార్యాలయూనికి తాళాలు సబ్స్టేషన్ల ముట్టడి,గేట్లకు తాళాలు, రాస్తారోకో రావుకుప్పం, మదనపల్లె రూరల్, సదుం, న్యూస్‌లైన్ : వ్యవసాయూనికి విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడంలేదని రామకుప్పంలో రైతులు సోవువారం స్థానిక రెస్కో కార్యాలయూన్ని వుుట్టడించారు. సిబ్బందిని బయుటకు పంపేశారు. కార్యాలయు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి ధర్నా చే శారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకపోవడంతో వుణేంద్రం, అత్తికుప్పం, కంభాళదేవులపల్లె, క్రిష్ణరాజపురం, మొద్దులవంక తదితర గ్రావూల పరిధిలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లోఓల్టేజీ సవుస్యతో ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోతున్నాయుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తబోర్లకు కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. వుణేంద్రం సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు పూనుకున్నారు. రెస్కో ఏడీ వుదన్మోహన్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. సవుస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటావుని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బైఠాయింపు, రాస్తారోకో కరెంటు సక్రమంగా సరఫరా చేయడం లేద ని 20కుగ్రామాల మదనపల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గేట్లకు తాళాలువేసి ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లె సబ్‌స్టేషన్ అధికారులు పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పరిశ్రమలకు మాత్రం 24 గంటలూ విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, వ్యవసాయూనికి గంట కూడా కరెంటు ఇవ్వకుండా వేధిస్తున్నారని నెలరోజుల క్రితం డీఈకి ఫిర్యాదుచేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వలసపల్లె, చండ్రమాకులపల్లె, ఎస్టేట్, గూటం వారిపల్లె, కోటావారిపల్లె గ్రామాల రైతులు ఆముదలకాలువకు చెందిన మహేష్ రెడ్డి, బాబురెడ్డి అలియాస్ మురళీరెడ్డి, ఓంప్రకాష్ రెడ్డిల ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికిై పెగా సబ్‌స్టేషన్‌ను ముట్టడించి రాస్తారోకో చేశారు. సబ్ స్టేషన్లో నాలుగు ఫీడర్లు ఉన్నప్పటికీ ఎందుకు విద్యుత్‌కోతలు విధిస్తున్నారని అధికారులను నిలదీశారు. 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ గంట కూడా ఇవ్వక పోతే పంటలను ఎలా కాపాడుకోవాలని మండిపడ్డారు. ఏఈ ముస్తాక్ అహమ్మద్, రూరల్ ఎస్ఐ. రవిప్రకాష్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు. సదుంలో అధికారుల తీరుపై నిరసన ... విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని నిరసిస్తూ రైతులు సదుం మండలంలోని రెండు సబ్స్టేషన్లను ముట్టడించారు. చీకలచేను, సీఎం.గొల్లపల్లె, గాదేవారిపల్లెలకు ఐదు రోజులుగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో రైతులు చీకలచేను సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అగ్రహారం క్రాస్ సమీపంలోని సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతోనే త్రీ ఫేజ్ విద్యుత్ ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది తెలిపారు. దీంతో అగ్రహారం సమీపంలోని సబ్ స్టేషన్‌కు రైతులు చేరుకున్నారు. విద్యుత్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సిబ్బంది రైతులకు నచ్చజెప్పి పంపారు. -
ఆర్టీసీ నష్టం రూ.9.5 కోట్లు
సాక్షి, విజయవాడ : అసలే అంతంత మాత్రం ఆదాయంతో మనుగడ సాగిస్తున్న ఆర్టీసీకి సమైక్యసెగ తగిలింది. ఆరు రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల వల్ల ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్‌కు సుమారు రూ.9.5 కోట్లనష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి, కష్ణా,గుంటూరు జిల్లాలు విజయవాడ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ మూడు జిల్లాలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం తీవ్రంగా ఉంది. గతంలో తెలంగాణ సకల జనుల సమ్మె కారణంగా 45 రోజుల పాటు ఆయా ప్రాంతాలకు బస్సులు నిలిపివేయడంలో కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన విజయవాడ జోన్ ప్రస్తుతం సమైక్యాంధ్ర సెగ తగలడంతో మరింత నష్టాలబాట పడుతోంది. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగిన దాని ప్రభావం ఆర్టీసీపై పడుతూ ఉండటంతో నష్టాల నుంచి కొలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది. రోడ్డెక్కని 1500 బస్సులు.... జోన్ పరిధిలో సుమారు 3300 బస్సులు ఉండగా, అందులో 1500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల్లో బస్సులు మూడు రోజులు పాటు రోడ్డుపైకే రాలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల, తెనాలి డిపోల బస్సులు, కృష్ణాజిల్లాలోని గుడివాడ డిపో బస్సులు రెండు రోజుల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. మిగిలిన డిపోల్లో బస్సులు తిరిగినా... ఆక్యుపెన్సీరేషియో (ఓఆర్) 50 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 25 బస్సులు ధ్వంసం - రూ.లక్ష నష్టం... జోన్‌పరిధిలోని సమైక్యాంధ్ర ఆందోళన కారులు బస్సులపై తమ ప్రతాపం చూపించారు. అయితే గతంలో తరహాలో పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి దారుణాలకు పాల్పడకుండా అద్దాలు పగలగొట్టడం, టైర్లలో గాలి తీసివేయడం వంటి నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపట్టారు. సుమారు 25 బస్సులు దెబ్బతినడం వల్ల సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. ప్రత్యామ్నాయం వైపు ప్రయాణికుల చూపు! సమ్మె జరుగుతున్న సమయంలో ఆర్టీసీ బస్సుల్లో కంటే రైళ్లలోనూ, విమానాల్లోనూ ప్రయాణం చేయడం ఉత్తమమనే భావన ప్రయాణికుల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్లో నడిచే బస్సులు 60శాతం మించి ఓఆర్ రావడం లేదు. ప్రయాణికులంతా రైళ్లలో వెళుతూ ఉండటంతో అక్కడ సీట్లు దొరకడం క ష్టంగా మారింది. హైదరాబాద్ రూట్లో ఏ ఇబ్బందులు లేవని ప్రయాణికులు బస్సుల సౌకర్యం ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు బస్సులు నడుపుతాం మూడు జిల్లాలోనూ రోజుకు కోటిన్నర పైగా నష్టం వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు బస్సుల్ని నడుపుతున్నాం. అయితే బస్సు గమ్యస్థానం వరకు చేరదేమోనన్న భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కకపోవడంతో 50శాతం బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఓఆర్ తక్కువగానే ఉన్నప్పటికీ బస్సులు నడుపుతున్నాం. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్రవాదులు బస్సుల్ని అడ్డగించవద్దని కోరుతున్నాం. - నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్