విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర
- రామకుప్పంలో రెస్కో కార్యాలయూనికి తాళాలు
- సబ్‌స్టేషన్ల ముట్టడి,గేట్లకు తాళాలు, రాస్తారోకో
రావుకుప్పం, మదనపల్లె రూరల్, సదుం, న్యూస్‌లైన్ : వ్యవసాయూనికి విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడంలేదని రామకుప్పంలో రైతులు సోవువారం స్థానిక రెస్కో కార్యాలయూన్ని వుుట్టడించారు. సిబ్బందిని బయుటకు పంపేశారు. కార్యాలయు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి ధర్నా చే శారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకపోవడంతో వుణేంద్రం, అత్తికుప్పం, కంభాళదేవులపల్లె, క్రిష్ణరాజపురం, మొద్దులవంక తదితర గ్రావూల పరిధిలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లోఓల్టేజీ సవుస్యతో ట్రాన్స్‌ఫార్మర్లు తరుచూ కాలిపోతున్నాయుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తబోర్లకు కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. వుణేంద్రం సర్పంచ్ నాగరాజు ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు పూనుకున్నారు. రెస్కో ఏడీ వుదన్‌మోహన్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. సవుస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటావుని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
బైఠాయింపు, రాస్తారోకో
కరెంటు సక్రమంగా సరఫరా చేయడం లేద ని 20కుగ్రామాల మదనపల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గేట్లకు తాళాలువేసి ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లె సబ్‌స్టేషన్ అధికారులు పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పరిశ్రమలకు మాత్రం 24 గంటలూ విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, వ్యవసాయూనికి గంట కూడా కరెంటు ఇవ్వకుండా వేధిస్తున్నారని నెలరోజుల క్రితం డీఈకి ఫిర్యాదుచేశారు.
అయినా ప్రయోజనం లేకపోవడంతో వలసపల్లె, చండ్రమాకులపల్లె, ఎస్టేట్, గూటం వారిపల్లె, కోటావారిపల్లె గ్రామాల రైతులు ఆముదలకాలువకు చెందిన మహేష్ రెడ్డి, బాబురెడ్డి అలియాస్ మురళీరెడ్డి, ఓంప్రకాష్ రెడ్డిల ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికిై పెగా సబ్‌స్టేషన్‌ను ముట్టడించి రాస్తారోకో చేశారు.
సబ్ స్టేషన్‌లో నాలుగు ఫీడర్లు ఉన్నప్పటికీ ఎందుకు విద్యుత్‌కోతలు విధిస్తున్నారని అధికారులను నిలదీశారు. 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ గంట కూడా ఇవ్వక పోతే పంటలను ఎలా కాపాడుకోవాలని మండిపడ్డారు. ఏఈ ముస్తాక్ అహమ్మద్, రూరల్ ఎస్‌ఐ. రవిప్రకాష్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సదుంలో అధికారుల తీరుపై నిరసన ...
విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని నిరసిస్తూ రైతులు సదుం మండలంలోని రెండు సబ్‌స్టేషన్లను ముట్టడించారు. చీకలచేను, సీఎం.గొల్లపల్లె, గాదేవారిపల్లెలకు ఐదు రోజులుగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో రైతులు చీకలచేను సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అగ్రహారం క్రాస్ సమీపంలోని సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతోనే త్రీ ఫేజ్ విద్యుత్ ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది తెలిపారు.
దీంతో అగ్రహారం సమీపంలోని సబ్ స్టేషన్‌కు రైతులు చేరుకున్నారు. విద్యుత్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సిబ్బంది రైతులకు నచ్చజెప్పి పంపారు.