ఆదిలాబాద్: విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కుంతాల మండలంలోని కల్లూరు సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. 61వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ ధర్నాతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు రోజుల నుంచి కరెంటు సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చాకేపల్లి, నందన్, బామిని, నర్సాపూర్.జి గ్రామాల రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
(కుంతాల)
సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
Published Mon, Feb 2 2015 11:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement