పంటలు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సరిగ్గా అందివ్వడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
కేరామేరి: పంటలు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సరిగ్గా అందివ్వడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కేరామేరి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ఉన్న సబ్‌స్టేషన్ పరిధిలోని మూడవ ఫీడర్ కింద గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు. దీంతో ఆగ్రహించిన కేలీబీ, కర్కటగూడ, పర్వత్‌వాడ గ్రామాలకు చెందిన రైతులు సబ్ స్టేషన్‌ను మట్టడించారు. సిబ్బందిని సబ్‌స్టేషన్‌లోపల ఉంచి తాళాలు వేసి నిరసన తెలిపారు.