విద్యుత్‌కోతను నిరసిస్తూ రైతుల ధర్నా | power cut protest farmers strike | Sakshi
Sakshi News home page

విద్యుత్‌కోతను నిరసిస్తూ రైతుల ధర్నా

Published Mon, Apr 7 2014 4:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

power cut protest farmers strike

 శాలిగౌరారం, న్యూస్‌లైన్ : అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని శాలిగౌరారం, ఊట్కూరు, తుడిమిడి గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు  ఆదివారం రాత్రి స్థానిక 132/33 కేవీ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పలువురు రైతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తుండడం తో  పంటలు నిలువునా ఎండిపోతున్నాయని వాపోయారు.

 

  సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగానే  తీవ్రంగా నష్టపోతున్నామని  ఆవేదన వ్యక్తం చేశా రు. సుమారు గంటకు పైగా సబ్‌స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద రైతులు ఆందోళనా నిర్వహిం చినా ఎవరూ స్పందించకపోవడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సబ్‌స్టేషన్‌లోని ఆపరేటింగ్ గదిలోకి వెళ్లి  సంబందిత సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు.

 

ఈ విషయాన్ని విద్యుత్ ఉన్నతాధికారులకు ఫోన్‌లో తెలియజేసేందుకు సిబ్బంది, రైతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  విద్యుత్ సరఫరా చేస్తామని సిబ్బంది హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.  కార్యక్రమంలో సిం గిల్‌విండో డెరైక్టర్ వడ్లకొండ వెంకటయ్య, గోదల వెంకట్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, కుర్ర రమేశ్, గడ్డం వీరయ్య, కల్లూరి యల్లయ్య, గుండ్ల రాంమ్మూర్తి, కంది వెంకన్న, అయోద్య, యల్లయ్య, డెంకల అంజయ్య, కొయ్యడ శివశంకర్, అన్నెబోయిన సోమ య్య, జాని, నిమ్మల శంకర్, తాందారు సోములు, ఆకవరం నవీన్, మిర్యాల శ్రీను  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement