Saligauraram
-
రహదారి నిర్మాణ భూముల పరిశీలన
శాలిగౌరారం : మహారాష్ట్రలోని సిరోంచ నుంచి తమిళనాడులోని యర్పడు వరకు నూతనంగా నిర్మితమవుతోన్న 365 జాతీయ రహదారి మండలంలోని వంగమర్తి, మాదారంకలాన్, పెర్కకొండారం మీదుగా వెళ్తోంది. దీనికి సంబంధించిన భూములను నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వంగమర్తి, మాదారంకలాన్ గ్రామాల్లో భూములను సందర్శించారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడి క్షేత్ర విచారణ చేశారు. రహదారి నిర్మాణం విషయంలో భూసేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం భూములు కోల్పోతున్న రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ జంగయ్య, సర్వే డీఐ శ్రీహరి, మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఆర్ఐ నరేశ్, వీఆర్వోలు షేక్ మీరాసాహెబ్, నాగరాజు ఉన్నారు. -
అప్పుతీర్చే మార్గం కనిపించక..
శాలిగౌరారం : రెండేళ్ల కిత్రం అనారోగ్యంతో తండ్రి మృతి.. ప్రస్తుతం తల్లి కూడా ఆరోగ్యం బాగాలేక కదలలేని పరిస్థితి.. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన చెల్లి.. వీటితో ఒక పక్క కుటుంబ భారం.. మరో పక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు.. వాటిని జయించేందుకు విద్యను మధ్యలోనే మానేసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు అక్కెనపల్లి నాగరాజు (27). కానీ సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి నాగరాజు (27)కు గ్రామంలో నాలుగున్నర ఎకరాల వ్యవసాయ మెట్టభూమి ఉంది. ఉన్న వ్యవసాయ భూమిలో రెండేళ్లుగా పత్తి పంటను సాగు చేస్తూ వస్తున్నాడు. దాంతో నష్టం వచ్చింది. అయినా ఈ ఏడాది కూడా మళ్లీ పత్తిసాగు చేశాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నీరు నిలవడంతో పంట మొత్తం ఎర్రబారింది. దీనికి తోడు తెగులు సోకింది. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటికే సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. చేసిన అప్పులు పెరిగిపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో ఆయన కొద్ది రోజులుగా తీవ్ర మనోవేధనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య ఉమ తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అది గమనించిన నాగరాజు చెల్లెలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ద్విచక్ర వాహనంపై నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో 108 వాహనం కలిసింది. దాంట్లో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నాగరాజుకు వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సోమవారం మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చారి తెలిపారు. -
విద్యుత్‌కోతను నిరసిస్తూ రైతుల ధర్నా
శాలిగౌరారం, న్యూస్‌లైన్ : అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని శాలిగౌరారం, ఊట్కూరు, తుడిమిడి గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు ఆదివారం రాత్రి స్థానిక 132/33 కేవీ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పలువురు రైతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తుండడం తో పంటలు నిలువునా ఎండిపోతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. సుమారు గంటకు పైగా సబ్‌స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద రైతులు ఆందోళనా నిర్వహిం చినా ఎవరూ స్పందించకపోవడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌లోని ఆపరేటింగ్ గదిలోకి వెళ్లి సంబందిత సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. ఈ విషయాన్ని విద్యుత్ ఉన్నతాధికారులకు ఫోన్లో తెలియజేసేందుకు సిబ్బంది, రైతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విద్యుత్ సరఫరా చేస్తామని సిబ్బంది హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో సిం గిల్‌విండో డెరైక్టర్ వడ్లకొండ వెంకటయ్య, గోదల వెంకట్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, కుర్ర రమేశ్, గడ్డం వీరయ్య, కల్లూరి యల్లయ్య, గుండ్ల రాంమ్మూర్తి, కంది వెంకన్న, అయోద్య, యల్లయ్య, డెంకల అంజయ్య, కొయ్యడ శివశంకర్, అన్నెబోయిన సోమ య్య, జాని, నిమ్మల శంకర్, తాందారు సోములు, ఆకవరం నవీన్, మిర్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.