శాలిగౌరారం : మహారాష్ట్రలోని సిరోంచ నుంచి తమిళనాడులోని యర్పడు వరకు నూతనంగా నిర్మితమవుతోన్న 365 జాతీయ రహదారి మండలంలోని వంగమర్తి, మాదారంకలాన్, పెర్కకొండారం మీదుగా వెళ్తోంది. దీనికి సంబంధించిన భూములను నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వంగమర్తి, మాదారంకలాన్ గ్రామాల్లో భూములను సందర్శించారు.
అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడి క్షేత్ర విచారణ చేశారు. రహదారి నిర్మాణం విషయంలో భూసేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం భూములు కోల్పోతున్న రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ జంగయ్య, సర్వే డీఐ శ్రీహరి, మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఆర్‌ఐ నరేశ్, వీఆర్వోలు షేక్ మీరాసాహెబ్, నాగరాజు ఉన్నారు.
రహదారి నిర్మాణ భూముల పరిశీలన
Published Tue, Mar 7 2017 5:07 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
Advertisement
Advertisement